సైంటిస్ట్ గా అరవింద్ స్వామి.. భార్యగా పూర్ణ?
on Aug 3, 2021
దిగ్గజ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ లో ఆగస్టు 6న `నవరస` పేరుతో ఓ తమిళ్ ఆంథాలజీ స్ట్రీమ్ కాబోతున్న సంగతి తెలిసిందే. లెజండరీ డైరెక్టర్ మణిరత్నంతో కలిసి జయేంద్ర నిర్మించిన ఈ క్రేజీ ఆంథాలజీ.. టైటిల్ కి తగ్గట్టే నవ రసాల సమ్మేళనంగా తెరకెక్కనుంది. ఒక్కో ఎపిసోడ్ ఒక్కో రసం (ఎమోషన్) చుట్టూ తిరగడమే ఈ ఆంథాలజీ ప్రత్యేకత. సూర్య, అరవింద్ స్వామి, విజయ్ సేతుపతి, సిద్ధార్థ్, ప్రకాశ్ రాజ్, రేవతి, అంజలి, పార్వతి వంటి ప్రముఖ నటీనటులు ఈ ఆంథాలజీలో దర్శనమివ్వనున్నారు. ప్రియదర్శన్, గౌతమ్ మీనన్, కార్తిక్ సుబ్బరాజ్, కార్తిక్ నరేశ్, వసంత్, అరవింద్ స్వామి, రతీంద్రన్ ఆర్. ప్రసాద్, బిజోయ్ నంబియార్, సర్జున్.. ఇలా తొమ్మిదిమంది దర్శకులు ఈ ఎపిసోడ్స్ ని రూపొందించారు.
ఇదిలా ఉంటే.. ఈ ఆంథాలజీలో `అద్భుత`రసానికి సంబంధించిన ఎపిసోడ్ చాలా ప్రత్యేకంగా ఉంటుందట. కార్తిక్ నరేన్ డైరెక్ట్ చేసిన ఈ ఎపిసోడ్ లో అరవింద్ స్వామి, పూర్ణ జంటగా నటించారు. సైంటిస్ట్ పాత్రలో అరవింద్ స్వామి కనిపించనుండగా.. అతని భార్య పాత్రలో పూర్ణ కనిపిస్తుందట. వీరిద్దరి మధ్య సాగే సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయని బజ్. మరి.. అరవింద్ స్వామి, పూర్ణ జోడీ `అద్భుత` రసాన్ని ఏ స్థాయిలో పండిస్తారో తెలియాలంటే మరో మూడు రోజులు ఆగాల్సిందే.