హ్యాపీ బర్త్‌డే రష్మిక.. సో క్యూట్ 'ఆడవాళ్లు మీకు జోహార్లు' లుక్!
on Apr 5, 2021

రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న 'ఆడవాళ్లు మీకు జోహార్లు' ఫస్ట్ లుక్ వచ్చేసింది. శర్వానంద్ హీరోగా నటిస్తోన్న ఈ మూవీని కిశోర్ తిరుమల డైరెక్ట్ చేస్తున్నాడు. మార్చి 5 రష్మిక బర్త్‌డే. ఈ సందర్భంగా నిర్మాతలు ఆమె ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. సౌత్ ఇండియా స్వీట్ హార్ట్‌గా పేరు తెచ్చుకున్న రష్మిక పదహారణాల తెలుగమ్మాయిలా కనిపిస్తూ సో క్యూట్ అనిపిస్తోంది. యెల్లో కలర్ శారీలో ఒక గార్డెన్‌లో కూర్చొని బంతిపూల మాల పేరుస్తూ చిరునవ్వు నవ్వుతూ చూడగానే అందర్నీ ప్రేమలో పడేస్తోంది రష్మిక.
'ఆడవాళ్లు మీకు జోహార్లు' నిర్మాతలు తమ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా రష్మికకు బర్త్‌డే విషెస్ తెలియజేస్తూ, ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను షేర్ చేసి, “Team #AadavaalluMeekuJohaarlu wishes the most talented & cutest actress @iamRashmika a very Happy Birthday #HBDRashmikaMandanna @ImSharwanand @DirKishoreOffl .” అంటూ ట్వీట్ చేశారు.
'ఆడవాళ్లు మీకు జోహార్లు' మూవీతో తొలిసారి జోడీ కట్టారు రష్మిక, శర్వానంద్. ఆ ఇద్దరితో డైరెక్టర్ కిశోర్ తిరుమలకూ ఇది ఫస్ట్ ఫిల్మ్. రష్మిక 25వ బర్త్‌డే సందర్భంగా రిలీజ్ చేసిన ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌కు ఫ్యాన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ అమోఘం. ఎస్ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ మూవీని నిర్మిస్తున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



