వైరల్ అవుతున్న హన్సిక మెహందీ ఫంక్షన్ వీడియో
on Dec 3, 2022
టాలీవుడ్ హీరోయిన్, దేశముదురు ఫేం హన్సిక మెత్వాని పెళ్లి సందడి మొదలైంది. అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘దేశముదురు’ సినిమాతో హీరోయిన్గా పరిచయమైన హన్సిక మోత్వాని ముంబైకి చెందిన వ్యాపారవేత్త సోహైల్‌ని పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసింది. రీసెంట్గా గ్రీస్‌లో బ్యాచ్‌లర్ పార్టీ ఇచ్చిన హన్సిక ఇటీవలే ఇండియాకు తిరిగి రాగానే మెహందీ ఫంక్షన్ గ్రాండ్‌గా నిర్వహించారు. ముండోటా కోటలో జరిగిన ఈ మెహందీ వేడుకలో హన్సిక, సోహైల్ సందడి చేశారు. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
హన్సిక-సోహైల్ వివాహ వేడుక రాజస్థాన్ రాష్ట్రం జైపూర్‌లోని అత్యంత ప్రాచీన కాలానికి చెందిన ముందోటా ఫోర్ట్ అండ్ ప్యాలెస్‌లో డిసెంబర్ 4న అంగరంగ వైభవంగా జరగనుంది. పెళ్లికి వచ్చే అతిథులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకుంటున్నాడు సోహైల్. ఇదే ప్యాలెస్‌లో గతేడాది హన్సిక సోదరుడు ప్రశాంత్ మోత్వాని వివాహం జరిగింది. హన్సిక సోదరుడి పెళ్లికంటే తమ పెళ్లి ఎంతో వైభవంగా జరుపుకోవాలని హన్సిక, సోహైల్ ప్యాలెస్‌లో ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
Also Read