గుండమ్మ కథ రీమేక్ అవసరమా..?
on Apr 26, 2016

క్లాసిక్స్ అన్న పేరు ఊరికే రాదు. కలకాలం నిలిచి ఉండేవే క్లాసిక్స్. అలాంటి సినిమాలను రీమేక్ చేయాలనుకోవడం, కత్తి మీద సామే. సహజంగానే భారీ అంచనాలతో ఉండే క్లాసిక్స్ ను మళ్లీ తీసి ఆ అంచనాలను అందుకోవడం దాదాపు అసాధ్యం. బాలీవుడ్ లో జంజీర్ అనే క్లాసిక్ ను రీమేక్ చేసి రాం చరణ్ అలాగే దెబ్బతినేశాడు. అందుకే సాధారణంగా అలాంటి ప్రయోగాలు జోలికి వెళ్లకుండా ఉండటమే చాలా మంచిది. కానీ తాజాగా ఈడో రకం ఆడోరకం సక్సెస్ మీట్ లో మోహన్ బాబు ఒక ఆసక్తికర వ్యాఖ్య చేశారు. గుండమ్మ కథ రీమేక్ రైట్స్ కొని మళ్లీ తీస్తానని ఆయన చెబుతున్నారు. ఇది విన్న చాలా మంది పాత సినిమా లవర్స్ గుండెల్లో రాయి పడింది. ఎందుకంటే గుండమ్మ కథ సినిమాకు ఉన్న ఫ్యాన్స్ తక్కువ కాదు. తెలుగునాట గుండమ్మ కథ, మాయాబజార్ సినిమాలకు ఎన్ని తరాలైనా తరగని ఆదరణ ఉంటుంది. మాయాబజార్ ను సుమన్ హీరోగా పెట్టి సాంఘీకంగా తీసి దాసరి ఆల్రెడీ దెబ్బతినేశారు. ఇప్పుడు ఆయన శిష్యుడైన మోహన్ బాబు గుండమ్మ కథను తీసేస్తానంటున్నారు. ఆలోచన బాగానే ఉంది. హీరోలు కూడా ఉన్నారు. కానీ అసలైన సూర్యకాంతం పాత్రకు ఈ కాలంలో ఎవరు కరెక్ట్ గా సెట్ అవుతారు అనేది ఇప్పుడున్న ప్రశ్న. ఆమె పాత్ర పండకుంటే సినిమా కనీసపు ఆకర్షణ కూడా ఉండదు. ఇలా క్లాసిక్ రీమేక్ లో ఎన్నో సమస్యలుంటాయి. ఇప్పటి వరకూ పాత చిత్రరాజాల్ని రీమేక్ చేసి సక్సెస్ కొట్టిన దాఖలాలు దాదాపు లేవు. కాబట్టి వాటిని కిందికి లాగకుండా, ఆ రేంజ్ లోనే ఉండనివ్వడం మేలేమో..!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



