రామ్‌చరణ్‌తో అటువంటి ప్లానింగ్ ఏమీ లేదన్నాడు!
on May 30, 2020

నిజం నెమ్మదిగా నడిచి వచ్చేలోపు, అబద్దం ఆఘమేఘాల మీద ఊరంతా తిరిగి వార్తల్లోకి చేరుతుంది. రామ్‌చరణ్ కొత్త సినిమా విషయంలో అటువంటి అబద్దం ఒకటి సోషల్ మీడియా అంతా చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్‌ఆర్‌ఆర్: రౌద్రం రణం రుధిరం’ సినిమాలో రామ్‌చరణ్ నటిస్తున్నారు. దీని తర్వాత ఆయన ఎవరి దర్శకత్వంలో సినిమా చేస్తారని ఇంకా ఖరారు కాలేదు. కానీ, పలువురి దర్శకుల పేర్లు వార్తల్లో వినిపిస్తున్నాయి. అందులో కొత్తగా వినిపించిన పేరు ‘మళ్లీ రావా’ వంటి ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్‌తో దర్శకుడిగా పరిచయమై, ‘జెర్సీ’ వంటి స్పోర్ట్స్ బేస్డ్ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ తీసిన గౌతమ్ తిన్ననూరిది.
ఇప్పుడు హిందీలో షాహిద్ కపూర్ హీరోగా ‘జెర్సీ’ని రీమేక్ చేస్తున్నారు గౌతమ్ తిన్ననూరి. రామ్‌చరణ్ ‘ఆర్‌ఆర్‌ఆర్’ చేస్తున్నారు. ఇద్దరూ తమ తమ సినిమాలు పూర్తి చేసిన తర్వాత కలిసి పని చేస్తారని ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ‘ఆర్‌ఆర్‌ఆర్’ తర్వాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రామ్‌చరణ్ సినిమా చేస్తారని ఆ వార్త సారాంశం. అయితే... అటువంటి ప్లానింగ్ ఏమీ లేదని, నెక్ట్స్ సినిమా గురించి డిస్కషన్స్ చేయడం లేదని సన్నిహితులతో గౌతమ్ అంటున్నారు. అదీ సంగతి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



