`పక్కా కమర్షియల్`కి గోపీచంద్ జూలై సెంటిమెంట్!
on Jun 16, 2022

`పక్కా కమర్షియల్`.. మ్యాచో స్టార్ గోపీచంద్ నుంచి రాబోతున్న తాజా చిత్రం. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి తెరకెక్కించిన ఈ కోర్ట్ రూమ్ డ్రామాలో లాయర్ గా ఎంటర్టైన్ చేయనున్నారు గోపీచంద్. అతనికి జోడీగా రాశీ ఖన్నా నటించగా, సత్యరాజ్ ఓ ముఖ్య పాత్రలో దర్శనమివ్వనున్నారు. యూవీ క్రియేషన్స్, జీఎ2 పిక్చర్స్ పతాకాలపై బన్నీ వాస్ నిర్మించిన ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ జూలై 1న జనం ముందుకు రాబోతోంది.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. గోపీచంద్ కి జూలై నెలలో పలు మెమరబుల్ హిట్స్ ఉన్నాయి. ఆ వివరాల్లోకి వెళితే.. తనకి కథానాయకుడిగా తొలి విజయాన్ని అందించిన `యజ్ఞం` చిత్రం 2004 క్యాలెండర్ ఇయర్ లో ఇదే జూలై మాసంలో విడుదలైంది. అలాగే, తన కెరీర్ బెస్ట్ మూవీస్ లో ఒకటైన `లక్ష్యం` కూడా 2007లో ఇదే నెలలో వినోదాలు పంచింది. అదేవిధంగా, యాక్షన్ అడ్వెంచరస్ మూవీగా తెరకెక్కిన `సాహసం` కూడా 2013లో జూలై నెలలోనే సందడి చేసింది. మరి.. లక్కీ మంత్ జూలైలో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్న గోపీచంద్ కి.. `పక్కా కమర్షియల్` కమర్షియల్ గా వర్కవుట్ అవుతుందేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



