శ్రీవాస్ తో గోపీచంద్ మూడో సినిమా..!
on Apr 26, 2016

లక్ష్యం, లౌక్యం సినిమాలతో హిట్ కాంబినేషన్ గా ప్రూవ్ చేసుకున్నారు హీరో గోపీ చంద్, డైరెక్టర్ శ్రీవాస్. సౌఖ్యం లాంటి భారీ డిజాస్టర్ తర్వాత గోపీచంద్ కు హిట్ చాలా అవసరం. ప్రస్తుతం ఎమ్ రత్నం తనయడు జ్యోతికృష్ణ డైరెక్షన్లో ఆక్సిజన్ చేస్తున్న గోపీ, ఆ తర్వాతి సినిమా శ్రీవాస్ తో కమిట్ అయ్యాడంటున్నాయి సినీ వర్గాలు. బాలయ్య 99వ సినిమా డిక్టేటర్ తో మంచి హిట్ కొట్టిన శ్రీవాస్, ప్రస్తుతం గోపీ కోసం స్క్రిప్ట్ ఫైనల్ చేసే పనిలో పడ్డాడు. గోపీచంద్ ఆక్సిజన్ పూర్తవ్వగానే, ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోందట. ఇప్పటికే సక్సెస్ ఫుల్ కాంబినేషన్ గా పేరొందిన ఈ జోడీ మళ్లీ మ్యాజిక్ రిపీట్ చేయాలని చూస్తున్నారు. గోపీకి హోం బ్యానర్ లాంటిదైన భవ్య క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. పూర్తి వివరాలు త్వరలోనే మూవీ టీం వెల్లడిస్తారని సమాచారం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



