రామ్ చరణ్ విలన్ డైరెక్టర్ అవతారం..!
on Apr 26, 2016

రామ్ చరణ్ తనీ ఒరువన్ రీమేక్ లో అరవింద్ స్వామి విలన్ గా నటిస్తున్న తెలిసిందే. తొంభైల్లో వచ్చిన రోజా, బొంబాయి సినిమాలతో అమ్మాయిల మనసులు దోచుకున్న అరవింద్ స్వామి ఆ తర్వాత వ్యక్తిగత వ్యవహారాలతో బిజీ అయిపోయాడు. చాలా కాలం వరకూ తెరపై కనిపించని అరవింద్, 2013లో కడలి సినిమాతో మళ్లీ సిల్వర్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇచ్చాడు. తర్వాతి నుంచి వరసగా సినిమాలు చేసుకుంటూ గతేడాది తమిళంలో తనీ ఒరువన్ లో విలన్ రోల్ తో మంచిపేరు సంపాదించుకున్నాడు. హిందీలో డియర్ డాడ్ అనే సినిమాను కూడా చేస్తున్న అరవింద్ స్వామి దృష్టి ఇప్పుడు డైరెక్షన్ వైపు మళ్లింది. త్వరలోనే డైరెక్షన్ చేసే ఛాన్స్ ఉందంటున్నాడు. ఎప్పటి నుంచో డైరెక్షన్ పై ఆశ ఉందని, కానీ దర్శకత్వం చేయడానికి సరైన టైం కోసం వెయిట్ చేశానని, ఇప్పుడు తనమీద తనకు నమ్మకం వచ్చిందంటున్నాడు అరవింద్. తాను సొంతంగా తయారుచేసుకున్న రెండు స్క్రిప్టులను ఈ ఏడాది చివరిలోపే స్టార్ట్ చేస్తానని క్లారిటీ ఇచ్చేశాడు. నటుడిగా అప్పుడప్పుడూ సక్సెస్ లు కొట్టిన అరవింద్, డైరెక్టర్ గా ఏమేరకు రాణిస్తాడో చూడాలి మరి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



