అమెజాన్ ప్రైమ్‌లో ఆగస్ట్ 14న వస్తున్న 'గాడ్జిల్లా వర్సెస్ కాంగ్'
on Jul 23, 2021
హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ 'గాడ్జిల్లా వర్సెస్ కాంగ్' ఆగస్ట్ 14 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్నది. ఒరిజినల్ ఇంగ్లిష్ వెర్షన్‌తో పాటు తెలుగు, తమిళ, హిందీ డబ్బింగ్ వెర్షన్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఆడమ్ వింగార్డ్ డైరెక్షన్లో వార్నర్ బ్రదర్స్, లెజెండరీ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించిన 'గాడ్జిల్లా వర్సెస్ కాంగ్' మూవీ ఈ ఏడాది మార్చి నెలలో థియేటర్లలో విడుదలై, మంచి వసూళ్లను సాధించింది.
తన నిజమైన ఆవాసాన్ని కనిపెట్టడానికి కాంగ్ అనే గొరిల్లా చేసే ప్రయాణం, జియా అనే అనాథ అమ్మాయితో దాని అనుబంధం చుట్టూ ఈ సినిమా కథ నడుస్తుంది. అయితే అనుకోకుండా కాంగ్, దాని రక్షణ బృందానికి గాడ్జిల్లా అనే భయంకర విధ్వంసక జంతువు ఎదురవుతుంది. గాడ్జిల్లాను కాంగ్ ఎలా ఎదుర్కొందనేది ఆసక్తికరం.
2019లో వచ్చిన 'గాడ్జిల్లా: కింగ్ ఆఫ్ ద మాన్స్టర్స్' మూవీకి ఈ సినిమా ఫాలో-అప్ అనుకోవచ్చు. ఈ రిబూటెడ్ ఫ్రాంచైజీ 2014లో వచ్చిన 'గాడ్జిల్లా'తో మొదలైంది. ఆ తర్వాత మూడేళ్లకు వచ్చిన 'కాంగ్: స్కల్ ఐలాండ్' సినిమాలో కింగ్ కాంగ్ పునఃపరిచయమైంది.