ప్రభాస్ అరుదైన రికార్డు.. ఏషియాలోనే నెం.1
on Jul 23, 2021
బాహుబలితో ఎన్నో రికార్డ్స్ చేసి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ రోజురోజుకి తన స్థాయిని మరింత పెంచుకుంటున్నాడు. తాజాగా మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకొని ఇంటర్నేషనల్ మీడియాలో తన పేరు మారుమోగేలా చేసుకున్నాడు. 'టాప్ టెన్ మోస్ట్ హ్యాండ్సమ్ ఏషియన్ మెన్' జాబితాలో ప్రభాస్ అగ్రస్థానంలో నిలిచాడు.
తాజాగా విడుదలైన 'టాప్ టెన్ మోస్ట్ హ్యాండ్సమ్ ఏషియన్ మెన్ 2021' జాబితాలో ప్రభాస్ మొదటి స్థానంలో నిలిచాడు. పాకిస్తాన్, జపాన్, దక్షిణ కొరియా, చైనా దేశాలకు వారిని వెనక్కి ప్రభాస్ ఫస్ట్ ప్లేస్ సాధించాడు. ఈ అరుదైన ఫీట్ సాధించిన మొదటి ఇండియన్ హీరో ప్రభాస్ కావడం విశేషం. దీంతో సోషల్ మీడియాలో ప్రభాస్ పై పెద్ద ఎత్తున ప్రశంసల వర్షం కురుస్తోంది.
బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ మారిపోయింది. వరుస పాన్ ఇండియా మూవీలతో ఇండియాలో టాప్ స్టార్ గా దూసుకుపోతున్నాడు. రాధేశ్యాం, సలార్, ఆదిపురుష్ తో పాటు మరికొన్ని భారీ ప్రాజెక్ట్స్ లో ప్రభాస్ నటిస్తున్నాడు.
Also Read