విరాట పర్వం మూవీ పై గెటప్ శీను కామెంట్స్
on Jun 20, 2022

టాలీవుడ్ లో ఆడియన్స్ ఎంతగానో ఎదురుచూసిన చిత్రాల్లో ఒకటి "విరాట పర్వం" కూడా ఒకటి. ఈ మూవీలో సాయి పల్లవి, రానా నటించారు. నక్సలిజమ్ బ్యాక్ డ్రాప్ లో తొలిసారిగా వచ్చిన ఒక ప్రేమ కథ చిత్రం ఇది. నక్సలిజమ్ బ్యాక్ డ్రాప్ లో గతంలో ఎన్నో మూవీస్ వచ్చాయి. వాటిల్లో రాజకీయ నాయకుల గురుంచి ప్రభుత్వాల గురుంచి చాలా చెప్పారు. ఐతే ఇప్పుడున్న ట్రెండ్ కి అనుగుణంగా నక్సలిజమ్ బ్యాక్ డ్రాప్ లో క్యూట్ లవ్ స్టోరీని ఆడియన్స్ కి అందించారు వేణు ఊడుగుల..ఇప్పుడు ఈ మూవీ చూసిన సెలబ్రిటీస్ కానీ, ప్రజలు గాని దాని గురుంచి చర్చించుకుంటున్నారు. ఇప్పుడొస్తున్న మంచి మూవీస్ లో విరాట్ పర్వం కూడా ఒకటి అంటూ రివ్యూస్ ఇస్తున్నారు.
అలాగే ఇటీవల ఈ మూవీ చూసిన జబర్దస్త్ కమెడియన్ గెటప్ శీను దీనికి సంబంధించి ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నాడు. ఎంటైర్ టీమ్ కి విషెస్ చెప్పాడు శీను. రానా, పల్లవి పాత్రలకు ప్రాణం పోశారు అని అన్నాడు . చూడాలనిపించేలా తీశారు డైరెక్టర్ ఈ మూవీని అన్నాడు శీను. కామెడీ మూవీస్, యాక్షన్ మూవీస్ చాలా వున్నాయ్. కానీ ఇలాంటి మూవీ రావడం చాలా అరుదు. నిజాయితీతో కూడిన ఒక ప్రేమ కథ చిత్రం ఇది. ఇలాంటి చిత్రాన్ని తీసి ప్రేక్షకులను ఒప్పించి మెప్పించాలంటే మాటలు కాదు. కానీ ఆ విషయంలో వేణు సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చన్నాడు . అందరూ చూడాల్సిన మూవీ ఇది అంటూ ఈ చిత్రం పై గెటప్ శీను తన మనసులో మాటను వీడియో రూపంలో తన ఇన్స్టా పేజీలో పోస్ట్ చేసాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



