త్వరలోనే మోక్షజ్ఞ ఎంట్రీ.. ఇదే సాక్ష్యం!
on Jun 19, 2022

నటసింహం నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం గురించి ఎప్పటి నుంచో చర్చలు జరుగుతున్నాయి. అయితే ఒకానొక సమయంలో అసలు మోక్షజ్ఞకి సినిమాలంటే ఆసక్తి లేదని కూడా వార్తలొచ్చాయి. దీంతో నందమూరి ఫ్యాన్స్ డిజప్పాయింట్ అయ్యారు. అయితే ఇప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీపై మళ్ళీ కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.
మోక్షజ్ఞ డెబ్యూ మూవీ గురించి గతంలో ఎన్నో వార్తలు వచ్చాయి. మోక్షజ్ఞను లాంచ్ చేసే బాధ్యతను బాలయ్య ఈ డైరెక్టర్ కే ఇచ్చాడంటూ ఎన్నో పేర్లు వినిపించాయి. వారిలో బోయపాటి శ్రీను, పూరి జగన్నాథ్, క్రిష్ వంటి వారు ఉన్నారు. ఒకానొక సందర్భంలో 'ఆదిత్య 369' సీక్వెల్ గా రానున్న 'ఆదిత్య 999'తో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని బాలయ్య అన్నారు. కానీ అది కూడా కార్యరూపం దాల్చలేదు. మరోవైపు ఆ సమయంలో మోక్షజ్ఞ బొద్దుగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మోక్షజ్ఞకి అసలు సినిమాలంటే ఆసక్తి లేదని, అందుకే ఫిజిక్ విషయంలో శ్రద్ధ తీసుకోవడం లేదని భావించారంతా. అయితే మోక్షజ్ఞ లేటెస్ట్ ఫోటోలు మాత్రం నందమూరి ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహం తీసుకొస్తున్నాయి.

బాలయ్య తన 107వ సినిమాని గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా 'NBK 107' సెట్స్ లో మోక్షజ్ఞ సందడి చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అందులో మోక్షజ్ఞ స్లిమ్ గా, అందంగా కనిపిస్తున్నాడు. ఇటీవల మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి కసరత్తులు చేస్తున్నాడని, నెక్స్ట్ ఇయర్ ఎంట్రీ ఉంటుందని వార్తలొచ్చాయి. తాజాగా మోక్షజ్ఞ ఫోటోలు చూస్తుంటే ఆ వార్తలు నిజమే అనిపిస్తోంది. దీంతో నందమూరి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



