డైరెక్టర్ పేరుతో అమ్మాయిలను ట్రాప్ చేస్తున్న మోసగాళ్లపై కేసు!
on Jul 3, 2020
క్యాస్టింగ్ కాల్ పేరిట అమ్మాయిలను మోసం చేస్తూ, అందులో తన పేరును ఉపయోగిస్తున్న మోసగాళ్లపై 'ఆర్ఎక్స్ 100' డైరెక్టర్ అజయ్ భూపతి శుక్రవారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సోషల్ మీడియాలో తన పేరుతో నకిలీ అకౌంట్లను నిర్వహిస్తూ అమ్మాయిలను ట్రాప్ చేస్తున్న వారిపై అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరాడు. ఈ సందర్భంగా ఏ ఫోన్ నంబర్‌తో మోసం చేస్తున్నారో ఆ నంబర్‌ను కూడా ఆయన బహిర్గతం చేశాడు.
"అమ్మాయిలను ఎక్స్‌ప్లాయిట్ చేయడానికి నా పేరుతో సోషల్ మీడియాలో చాలా మంది నకిలీ ప్రొఫైల్స్‌ను క్రియేట్ చేశారని నా దృష్టికి వచ్చింది. గతంలో నా పేరుతో ఉన్న ప్రొఫైల్ నుంచి ఒక అమ్మాయికి మెసేజ్ వెళ్లిన ఈ తరహా వ్యవహారాన్ని నేను సెటిల్ చేశాను. అప్పుడు నకిలీ ప్రొఫైల్స్‌పై తగిన సలహాతో నా బృందం ఆ వ్యవహారాన్ని బహిర్గతం చేసింది.
అయితే ఆ వ్యవహారం అక్కడితే ముగియలేదు. మరికొంత మంది అమ్మాయిలు అలాంటి పరిస్థితినే, అది కూడా అదే నంబర్ (7995267901) నుంచే ఎదుర్కొంటున్నారు.
ఈ వ్యవహారాన్ని మేం సీరియస్‌గా తీసుకుంటున్నాం. సైబర్ క్రైమ్‌లో ఒక కేసు ఫైల్ చేశాం. మరింతమంది అమ్మాయిలు ఈ రకమైన ట్రాప్‌లో చిక్కుకొని ఉంటారని మేం ఊహిస్తున్నాం. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండి, ఇలాంటి మోసగాళ్ల విషయంలో జాగ్రత్తపడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం" అని ఒక ప్రకటనలో అజయ్ భూపతి తెలిపాడు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
