పిల్లలకు మొక్కలు నాటడం నేర్పించాలి: రేణు దేశాయ్
on Jul 3, 2020

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి తన కూతురు తో కలిసి మొక్కలు నాట్టారు హీరోయిన్ రేణు దేశాయ్ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా ప్రముఖ యాంకర్ ఉదయభాను ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి ఆమె తన కూతురు, కూతురి స్నేహితురాలు తో కలిసి జూబ్లీహిల్స్ లోని పార్కు లో మొక్కలు నాటారు. ప్రస్తుత జీవనివిధానంలో అపార్ట్ మెంట్ కల్చర్ వల్ల ప్రకృతిలో సహవాసం చేసే అవకాశం కోల్పోతున్నాం అన్నారు రేణు దేశాయ్. మన చిన్నతనంలో స్వంత ఇంటిలో ఉండటం, అప్పుడప్పుడు మన పెద్ద వాళ్ళు మొక్కలు నాటి పెంచుతూ ఉంటే మనం చూసి నేర్చుకునే వాళ్ళం అన్నారు. కానీ ఈ కొత్త తరానికి చెట్లను ఏ విధంగా నాటాలి పెంచాలని విషయం తెలియడం లేదని. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఉదయభాను చాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. రేణు తన కూతురు ఆద్య, కూతురు స్నేహితురాలు యషికలతో కూడా మొక్కలు నాటించారు. ఈ రోజు నాటిన మొక్కలు భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగపడుతాయన్నారు. పర్యావరణాన్ని రక్షించడం మనందరి బాధ్యత , ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా మొక్కలు నాటాలని ఆమె కోరారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



