'మార్క్ ఆంటోని' లుక్‌లో ఆకట్టుకుంటున్న విశాల్
on Aug 29, 2022

విశాల్ హీరోగా నటిస్తోన్న 33వ చిత్రానికి 'మార్క్ ఆంటోని' అనే టైటిల్ ఖరారు చేశారు. రీతూ వర్మ నాయికగా నటిస్తోన్న ఈ మూవీని అధిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేస్తున్నాడు. సోమవారం విశాల్ బర్త్‌డేను పురస్కరించుకొని మార్క్ ఆంటోని ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు నిర్మాతలు. ఈ పోస్టర్‌లో విశాల్ లుక్ సరికొత్తగా ఉండి, ఆకట్టుకుంటోంది. ఇంతదాకా ఎప్పుడూ తెరపై కనిపించని ఫుల్ బియర్డ్ లుక్‌లో కనిపిస్తున్నాడు. రౌద్రంగా షాట్ గన్ పట్టుకొని షూట్ చేస్తున్నాడు. నుదుటిన విభూతి నామం, ఒక చేతికి కడియం, రుద్రాక్ష ధరించి వింటేజ్ లుక్‌లో ఉన్నాడు విశాల్. అతని ఆహార్యం చూస్తుంటే పవర్‌ఫుల్ క్యారెక్టర్‌ను చేస్తున్నట్లు అర్థమవుతోంది.
యాక్షన్ డ్రామాగా తయారవుతున్న ఈ మూవీలో ఎస్.జె. సూర్య ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. సునీల్ వర్మ, అభినయ, వైజీ మహేంద్రన్, నిళల్‌గళ్ రవి, కింగ్‌స్లే ఇతర పాత్రధారులు. మినీ స్టూడియోస్ బ్యానర్‌పై ఎస్. వినోద్‌కుమార్ నిర్మిస్తోన్న ఈ చిత్రం ప్రస్తుతం సెట్స్‌పై ఉంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో 'మార్క్ ఆంటోని'ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జి.వి. ప్రకాశ్ సంగీతం సమకూరుస్తుండగా, అభినందన్ రామానుజం సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నాడు. దిలీప్ సుబ్బరాయన్, పీటర్ హెయిన్, కనల్ కణ్ణన్, రవివర్మ యాక్షన్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



