తెలుగు రాష్ట్రాల్లో 'లైగర్' పని అయిపోయినట్టేనా?
on Aug 29, 2022

ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలకు లేదా భారీ అంచనాలతో విడుదలైన మీడియం రేంజ్ సినిమాలకు టాక్ తో సంబంధం లేకుండా ఫస్ట్ వీకెండ్ మంచి ఓపెనింగ్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నెగటివ్ టాక్ వస్తే రెండో రోజుకే కలెక్షన్స్ పూర్తిగా డ్రాప్ అవుతున్నాయి. తాజాగా 'లైగర్' విషయంలోనూ అదే జరిగింది. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమా దారుణమైన నెగటివ్ టాక్ తెచ్చుకోవడంతో కలెక్షన్స్ రెండో రోజుకే పడిపోయాయి. నాలుగో రోజు ఆదివారం అయినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో రూ.55 లక్షల షేర్ మాత్రమే రాబట్టిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో రూ.62 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన లైగర్.. మొదటి రోజు 9.57 కోట్ల షేర్, రెండో రోజు 1.54 కోట్ల షేర్, మూడో రోజు 1 కోటి షేర్, నాలుగో రోజు 0.55 కోట్ల షేర్ రాబట్టింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి మూడు రోజుల్లో రూ.12.66 కోట్ల షేర్(21.45 కోట్ల గ్రాస్) సాధించింది. ఏరియాల వారీగా చూస్తే నాలుగు రోజుల్లో నైజాంలో రూ.5.56 కోట్ల షేర్(25 కోట్ల బిజినెస్), సీడెడ్ లో రూ.1.83 కోట్ల షేర్(9 కోట్ల బిజినెస్), ఆంధ్రాలో రూ.5.27 కోట్ల షేర్(28 కోట్ల బిజినెస్) వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.62 కోట్ల బిజినెస్ చేసిన ఈ మూవీ ఇప్పటిదాకా 20 శాతం మాత్రమే రికవర్ చేసింది. మొదటి వీకెండ్ లోనే ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయిన ఈ చిత్రం.. వీక్ డేస్ లో పుంజుకునే అవకాశం అసాధ్యమనే చెప్పొచ్చు. అదే జరిగితే ఫుల్ రన్ లో 25 శాతం రికవర్ చేయడం కూడా సందేహమే.
నార్త్ ఇండియా 6.25 కోట్ల షేర్, కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా 1.45 కోట్ల షేర్, ఇతర భాషలు 0.75 కోట్ల షేర్, ఓవర్సీస్ లో 3.30 కోట్ల షేర్ తో కలిపి నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 24.41 కోట్ల షేర్(50.50 కోట్ల గ్రాస్) రాబట్టినట్టు అంచనా. వరల్డ్ వైడ్ గా రూ.88.40 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన లైగర్.. మొదటి రోజు 13.45 కోట్ల షేర్, రెండో రోజు 4.06 కోట్ల షేర్, మూడో రోజు 3.75 షేర్, నాలుగో రోజు 3.15 షేర్ తో ఇప్పటిదాకా 27 శాతం మాత్రమే రికవర్ చేసింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



