అన్నపూర్ణలో అగ్ని ప్రమాదమా? అదేం లేదంటున్న స్టూడియో!
on Oct 16, 2020
.jpg)
అక్కినేని కుటుంబానికి చెందిన అన్నపూర్ణ స్టూడియోలో భారీ అగ్ని ప్రమాదం సంభవించిందనీ, భారీగా మంటలు ఎగసిపడటంతో ఫైర్ ఇంజిన్లు వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చాయని న్యూస్ ఛానళ్లలో వార్తలు వచ్చాయి. అయితే... ఫైర్ యాక్సిడెంట్ ఈ రోజు శుక్రవారం జరగలేదనీ, నిన్న గురువారం నాడు జరిగిందనీ కొందరు చెప్పుకొచ్చారు. అయితే, అటువంటిది ఏమీ లేదని అన్నపూర్ణ స్టూడియో వివరణ ఇచ్చింది.
"ఆల్ ఈజ్ వెల్ ఎట్ అన్నపూర్ణ. (అన్నపూర్ణలో అంతా బాగుంది). ధృవీకరించుకోకుండా వార్తను ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం" అని అన్నపూర్ణ స్టూడియో అధికారిక ట్విట్టర్ ఖాతా నుండి ట్వీట్ చేశారు.
గతంలో ఓసారి అన్నపూర్ణ స్టూడియోలో ఈ విధంగా ఒక అగ్ని ప్రమాదం సంభవించింది. అక్కినేని నాగార్జున ద్విపాత్రాభినయం చేసిన 'సోగ్గాడే చిన్ని నాయనా' కోసం ఒక సెట్ వేయగా, షార్ట్ సర్క్యూట్ వల్ల తగలబడింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



