నితిన్‌కి చెక్... లాక్‌డౌన్ టు లాకప్!
on Oct 16, 2020
'చెక్' కొత్త షెడ్యూల్ ప్రారంభమైనదని చెప్పడంలోనూ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి కాస్త క్రియేటివిటీ చూపించారు. లాక్‌డౌన్ నుండి నితిన్‌ని లాకప్‌లోకి తీసుకు వెళుతున్నామని ప్రకటించారు. అసలు వివరాల్లోకి వెళితే... నితిన్ కథానాయకుడిగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా 'చెక్'. శుక్రవారం ఈ సినిమా కొత్త షెడ్యూల్ మొదలు పెట్టారు. 'లాక్‌డౌన్ టు లాకప్' అని కొత్త పోస్టర్ విడుదల చేశారు.
'చెక్'లో ఉరిశిక్ష పడ్డ ఖైదీ పాత్రలో నితిన్ నటిస్తున్నారు. చదరంగం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ఖైదీ అంటే జైలుకి తీసుకు వెళతారు కదా! ఇప్పుడు ఆ జైలు నేపథ్యంలో సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఓ కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ న్యాయవాది పాత్రలో, మరో కథానాయికగా ప్రియా ప్రకాష్ వారియర్ నటిస్తున్నారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
