చిరు సినిమాకి 'కెజిఎఫ్' స్టంట్ మాస్టర్లు?
on Sep 28, 2020

చిరంజీవి కథానాయకుడిగా మెహర్ రమేష్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. తమిళంలో అజిత్ హీరోగా నటించిన 'వేదాళం'ను రీమేక్ చేయనున్నారు. దీనికి స్టంట్ మాస్టర్లుగా 'కెజిఎఫ్' చిత్రానికి పని చేసిన అన్బు-అరివు పని చేయనున్నారట. వాళ్ళు అయితేనే బెస్ట్ అని మెహర్ రమేష్ భావిస్తున్నారట.
'కెజిఎఫ్' సినిమాలో యాక్షన్ సన్నివేశాలకు యావత్ దేశ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అలాగే, కార్తీ హీరోగా నటించిన 'ఖైదీ'లో స్టంట్స్ కూడా అన్బు-అరివు చేశారు. వాటికీ మంచి పేరొచ్చింది. చిరంజీవి సినిమాకి వాళ్లను తీసుకుంటే కొత్త ఫీల్ వస్తుందని మెహర్ రమేష్ ఆలోచనగా తెలుస్తోంది. అయితే... అతడికి మెగాస్టార్ నుండి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉంది. తెలుగులో నాగశౌర్య 'అశ్వత్థామ'కి అన్బు-అరివు పని చేశారు.
ఆల్రెడీ ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ ను తీసుకున్నారు. ఛలో, భీష్మ చిత్రాలకు మహతి మంచి మ్యూజిక్ ఇచ్చాడు. సినిమాకి ఫ్రెష్ ఫీల్ తీసుకురావడం కోసం మెహర్ రమేష్ ప్రయత్నిస్తున్నారట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



