
మెగాస్టార్ వారసుడిగా రామ్‌చరణ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అప్పుడే పదమూడేళ్లు గడిచిపోయాయంటే నమ్మబుద్ధి కాదు. అవును. హీరోగా చరణ్ మొదటి సినిమా 'చిరుత' విడుదలై నేటికి సరిగ్గా పదమూడు సంవత్సరాలు. పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ఆ మూవీ 2007 సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పెద్ద హిట్ కాకపోయినప్పటికీ తండ్రి పేరు నిలిపే కొడుకు అవుతాడని అప్పుడే చాలా మంది ఊహించారు. గంభీరమైన కంఠం అతడికి ప్లస్ అనీ, బాడీ లాంగ్వేజ్ చిరంజీవిని గుర్తుకు తెస్తున్నప్పటికీ, త్వరలోనే తనదైన స్టైల్‌ను రూపొందించుకుంటాడనీ విమర్శకులు అభిప్రాయపడ్డారు.
వారి నమ్మకం నిజమవడానికి ఎంతో కాలం పట్టలేదు. రెండో సినిమా 'మగధీర'తోటే తనేమిటో అతను ప్రూవ్ చేశాడు. యస్.యస్. రాజమౌళి డైరెక్ట్ చేసిన ఆ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్ల పరంగా ఇండస్ట్రీ రికార్డ్ సృష్టించింది. దాని తర్వాత రచ్చ, నాయక్, ఎవడు, ధృవ లాంటి హిట్ సినిమాలు అందించాడు చరణ్. 2018లో సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన 'రంగస్థలం' మూవీ బ్లాక్‌బస్టర్ కావడమే కాకుండా, చరణ్‌లో ఇప్పటిదాకా మనం చూడని ఉన్నత స్థాయి నటుడున్నాడని తెలియజేసింది. ప్రస్తుతం అతను రాజమౌళి డైరెక్షన్‌లో 'ఆర్ఆర్ఆర్' మూవీ చేస్తున్నాడు.
.jpg)
కాగా తన తొలి సినిమా 'చిరుత' విడుదలై 13 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా సెలబ్రేట్ చేసుకున్నాడు చరణ్. 'చిరుత' మూవీ పోస్టర్, సెట్స్‌పై డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తో ఉన్న స్టిల్, సినిమాలో హీరోయిన్ నేహాశర్మతో ఉన్న స్టిల్.. మొత్తం మూడు పిక్చర్లను షేర్ చేశాడు. ఈరోజు పూరి బర్త్‌డే కూడా.
"13 సంవత్సరాలయిపోయాయంటే నమ్మాలనిపించట్లేదు. గొప్ప ఎత్తులు, కొన్ని పల్లాలు, ప్రతి క్షణాన్నీ ఆస్వాదించాను. ఎల్లప్పుడూ నాతో ఉన్న డియరెస్ట్ ఫ్యాన్స్‌కు థాంక్స్. మీ ప్రేమకు వినమ్రుడిని. హార్ట్ వర్క్ చేస్తానని ప్రామిస్ చేస్తున్నా గైస్. నిన్నే జరిగినట్లుగా 'చిరుత'కు సంబంధించిన ప్రతి రోజునూ గుర్తు చేసుకుంటాను. థాంక్ యు పూరి జగన్నాథ్ గారు, వైజయంతీ మూవీస్, నేహాశర్మ, మణిశర్మ గారు, మొత్తం టీమ్. అండ్ హ్యాపీ బర్త్‌డే పూరి జగన్ గారు!!!" అని రాసుకొచ్చాడు చరణ్.
.jpg)





.jpg)
