కమల్ ఫ్యామిలీ.. ఒక్కొక్కరు ఒక్కో ఇంట్లో!
on Mar 24, 2020
.jpg)
కమల్ హాసన్ చెన్నైలో ఉన్నారు. ఆయన చిన్న కుమార్తె అక్షరా హాసన్ కూడా చెన్నైలో ఉన్నారు. కానీ, ఒకే ఇంటిలో ఉండటం లేదు. వేర్వేరు ఇళ్లల్లో ఉంటున్నారు. దీనికి కారణం కరోనా. ఈ మహమ్మారి ఎవరికీ సోకకుండా ఉండే క్రమంలో ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారు. కమల్ పెద్ద కుమార్తె శ్రుతి హాసన్ ముంబైలో ఉన్నారు. శ్రుతి, అక్షర తల్లి సారిక కూడా ముంబైలో ఉన్నారు. అలాగని, తల్లీ కూతురు ఒకే ఇంటిలో ఉండటం లేదు. వేర్వేరు ఇళ్లల్లో ఉంటున్నారు. సాధారణంగా శ్రుతి లేదా అక్షర చెన్నైలో ఉంటే ఎక్కువగా తండ్రి కమల్ ఇంటిలో, ముంబైలో ఉంటే తల్లి సారిక ఇంట్లో ఉంటారు. సొంత ఫ్లాట్స్‌లో ఉండటం తక్కువ. అయితే కరోనా కారణంగా వేర్వేరు ఇళ్లల్లో స్వీయ నిర్బంధంలో ఉన్నారు.
శ్రుతి హాసన్ పది రోజుల క్రితం లండన్ వెళ్లి వచ్చారు. అందుకని, తనకు తాను స్వీయ నిర్బంధం విధించుకున్నారు. బయటకు వెళ్లకుండా ఉండటం ఎవరికైనా కష్టంగా ఉన్నప్పటికీ... మన వల్ల ఇతరులకు ప్రమాదం రాకుండా ఉండాలంటే ఇళ్లలో ఉండటమే ఉత్తమమని ఆమె అన్నారు. ప్రజలు ఇప్పుడిప్పుడే సీరియస్‌గా తీసుకుంటున్నారని శ్రుతి పేర్కొన్నారు.
ప్రస్తుతం ఆమె రెండు సినిమాల్లో నటిస్తున్నారు. తెలుగులో మాస్ మహారాజా రవితేజ 'క్రాక్' ఒకటి, తమిళంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి 'లాభం' మరొకటి. కరోనా వైరస్ క్లియర్ అయిన తర్వాత ఆ రెండు సినిమాల షూటింగ్స్ స్టార్ట్ చేస్తానని శ్రుతి హాసన్ తెలిపారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



