అనసూయ.. నీ ఓవర్ యాక్షన్ షోలు చూస్కో!
on Mar 24, 2020

అనసూయ పేరు చెబితే ట్విట్టర్‌లో ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ తోక తొక్కిన తాచులా పైకి లేచి బుసలు కొడుతున్నారు. గడచిన 48 గంటలుగా అనసూయకు, నెటిజన్లలో కొందరికి మధ్య మాటల యుద్ధం నడిచింది. లాక్‌డౌన్ చేస్తే ఇంటి అద్దెలు, కరెంట్ బిల్లులు, ఈఎంఐలు ఎలా కట్టుకోవాలని అనసూయ అనడం, ఆమెపై కొందరు సెటైర్స్ వేయడం తెలిసిన విషయాలే. కొంతమంది హద్దుమీరి కామెంట్స్ చేయడంతో ట్విట్టర్‌లో అనసూయ పోలీస్ కంప్లయింట్ ఇచ్చారు. లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయమని పోలీసులు కోరారు.
ఈ గొడవ అంతా పక్కన పెడితే... "ప్లీజ్... (ఇంట్లో) చూడటానికి వెబ్ సిరీస్‌లు సజెస్ట్ చేయండి" అని అనసూయ ట్వీట్ చేశారు. కొందరు నిజాయతీగా, హుందాగా కొన్ని వెబ్ సిరీస్‌ల పేర్లు చెప్పారు. ఇంకొందరు మాత్రం ఒక రేంజ్‌లో రిప్లైలు ఇచ్చారు. "నాలుగు ట్వీట్స్ వెయ్యి... ఫుల్ టైమ్‌పాస్" అని ఒకరు, "జగన్ అన్న పాదయాత్ర... అంతకంటే పెద్ద వెబ్ సిరీస్ ఉండదు. 350 రోజుల ఫుటేజ్ అనుకుంట" అని ఇంకొకరు... ఎవరికి తోచిన విధంగా వారు కామెంట్ చేశారు. ఒకరు మాత్రం "నీ ఓవర్ యాక్షన్ షోస్ చూస్కో" అని కామెంట్ చేశారు. ఒక్కటి మాత్రం నిజం... ట్విట్టర్‌లో కూడా అనసూయ జనాలకు ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



