లక్కీ మంత్ లోనే వస్తున్న వరుణ్ తేజ్
on Jan 20, 2021

చేసింది తక్కువ సినిమాలే అయినా.. నటుడిగా మంచి గుర్తింపునే తెచ్చుకున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ఐదో చిత్రం ఫిదాతో తొలి విజయాన్ని చూసిన వరుణ్.. అక్కడి నుంచి వరుస విజయాలు అందుకుంటున్నాడు. ప్రస్తుతం ఎఫ్ 3, గని సినిమాలతో బిజీగా ఉన్న ఈ యంగ్ హీరో.. తక్కువ గ్యాప్ లోనే ఆయా చిత్రాలతో పలకరించబోతున్నాడు. వీటిలో ఎఫ్ 3 వేసవి చివరలో విడుదల కానుండగా.. గని జూలై నెలలో రిలీజ్ కానుంది.
ఆసక్తికరమైన విషయమేమిటంటే.. వరుణ్ కి ఫస్ట్ సక్సెస్ ని అందించిన ఫిదా కూడా జూలై నెలలోనే విడుదలైంది. కట్ చేస్తే.. నాలుగేళ్ళ తరువాత మళ్ళీ అదే నెలలో గనితో పలకరించబోతున్నాడీ కొణిదెల వారి హ్యాండ్సమ్ హీరో. మరి.. ఫిదాలాగే గని కూడా వరుణ్ కి బ్లాక్ బస్టర్ హిట్ ని అందిస్తుందేమో చూడాలి.
స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న గనిలో వరుణ్ బాక్సర్ గా నటిస్తున్నాడు. సయీ మంజ్రేకర్ నాయికగా నటిస్తున్న ఈ సినిమాలో ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతిబాబు ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి తమన్ బాణీలు అందిస్తున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



