అమెజాన్ ప్రైమ్ లో 'ఏకమ్' సినిమా సంచలనం.. టాప్-10లో స్థానం!
on Jan 18, 2022

ఎస్.ఎమ్.ఎస్ క్రియేషన్స్ పతాకంపై వరుణ్ వంశీని దర్శకుడుగా పరిచయం చేస్తూ ఎ.కళ్యాణ్ శాస్త్రి-పూజ.ఎమ్-శ్రీరామ్.కె సంయుక్తంగా నిర్మించిన విభిన్న కథాచిత్రం 'ఏకమ్'. 'ది జర్నీ ఆఫ్ ఏ జాబ్ లెస్ గాడ్' అన్నది ఉప శీర్షిక. అభిరామ్ వర్మ, శ్వేతావర్మ, తనికెళ్ళ భరణి, అదితి మ్యాకల్, కల్పిక గణేష్, దయానంద్ రెడ్డి ముఖ్య తారాగణంగా రూపొందిన ఈ చిత్రం అక్టోబర్ 29 న విడుదలై ప్రేక్షకుల ఆదరణతోపాటు విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది.
'ఏకమ్' చిత్రానికి తాజాగా అమెజాన్ ప్రైమ్ లో అసాధారణ స్పందన లభిస్తోంది. అమెజాన్ ప్రైమ్ లో 503 వ చిత్రంగా విడుదలైన 'ఏకమ్' కేవలం పది రోజుల్లో టాప్-10లో స్థానం సంపాదించుకుని అందరి దృష్టినీ విశేషంగా ఆకర్షిస్తోంది. పంచ భూతాల నేపథ్యంలో ఫిలసాఫికల్ డ్రామాగా.. తాత్విక చింతనకు ఆధునికత జోడించి తెరకెక్కిన 'ఏకమ్' చిత్రానికి అమెజాన్ ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది.
ఈసందర్భంగా చిత్రదర్శకుడు వరుణ్ వంశీ మాట్లాడుతూ.. "ఏకమ్ చిత్రాన్ని ప్రేక్షకులంతా ఏకగ్రీవంగా ఆదరిస్తుండడం చాలా సంతోషాన్నిస్తోంది. మా నిర్మాతల పెట్టుబడిని సేఫ్ గా వెనక్కి తెస్తుండడంతోపాటు.. దర్శకుడిగా నాకు రెండో సినిమా వచ్చేలా చేసింది. ప్రస్తుతం అమెజాన్ లో టాప్ 10లో ఉన్న 'ఏకమ్' అతి త్వరలో టాప్ 3లో నిలుస్తుందనే నమ్మకం మాకుంది. ఆడియన్స్ తోపాటు.. 'ఏకమ్' చిత్ర రూపకల్పనలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను" అన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



