Home

»

Latest News

ఈద్ స్పెష‌ల్ః ఇక్క‌డ `ఎఫ్ 3`.. అక్క‌డ `హీరోపంతి 2`!

Jan 18, 2022 2:37PM

భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఈ ఏడాది సీక్వెల్ మూవీస్ సంద‌డి కాస్త ఎక్కువ‌గానే క‌నిపించ‌బోతోంది. తెలుగు, క‌న్న‌డ‌, హిందీ.. ఇలా ప‌లు భాష‌ల్లో ఈ త‌ర‌హా చిత్రాలు వెండితెర‌పై వినోదాలు పంచ‌నున్నాయి. అయితే, ఒకే తేదిన తెలుగులో ఓ సీక్వెల్, హిందీలో ఓ సీక్వెల్ రాబోతోంది. అది కూడా.. ఈద్ స్పెష‌ల్ గా ఈ మూవీస్ ఎంట‌ర్టైన్ చేయ‌నున్నాయి.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. 2019 సంక్రాంతి విజేత‌గా నిలిచిన హిలేరియ‌స్ ఎంట‌ర్టైనర్ `ఎఫ్ 2`కి కొన‌సాగింపు చిత్రంగా `ఎఫ్ 3` తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాని రంజాన్ కానుక‌గా ఏప్రిల్ 29న విడుద‌ల చేయ‌బోతున్నారు.  విక్ట‌రీ వెంక‌టేశ్, మెగాప్రిన్స్ వ‌రుణ్ తేజ్, మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా, స్ట‌న్నింగ్ బ్యూటీ మెహ్రీన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న‌ ఈ సీక్వెల్ కి ఒరిజ‌న‌ల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి కెప్టెన్.

ఇక 2014 నాటి బాలీవుడ్ హిట్ మూవీ `హీరోపంతి` (`ప‌రుగు` రీమేక్)కి సీక్వెల్ గా త‌యార‌వుతున్న ` హీరోపంతి 2` కూడా ఈద్ స్పెష‌ల్ గా ఏప్రిల్ 29నే రిలీజ్ కానుంది. `హీరోపంతి`లో క‌థానాయ‌కుడిగా న‌టించిన టైగ‌ర్ ష్రాఫ్ ఈ సీక్వెల్ లోనూ హీరోగా న‌టిస్తుండ‌గా.. తారా సుతారియా నాయిక‌. `హీరోపంతి`కి ష‌బ్బీర్ ఖాన్ డైరెక్ట‌ర్ కాగా, `హీరోపంతి 2`కి అహ్మ‌ద్ ఖాన్ నిర్దేశ‌కుడు. మ‌రి.. ఒకే రోజు విభిన్న భాష‌ల్లో రాబోతున్న ఈ సీక్వెల్స్ ఎలాంటి ఫ‌లితాల‌ను అందుకుంటాయో చూడాలి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com