'కేజీఎఫ్'తో కైకాల సత్యనారాయణ ఎన్ని కోట్లు సంపాదించారో తెలుసా?
on Dec 24, 2022

తెలుగు చలనచిత్ర పరిశ్రమ మరో మహానటుడిని కోల్పోయింది. మనం నవరస నటనా సార్వభౌమను భౌతికంగా కోల్పోయాం. తెలుగులో మిగిలి ఉన్న సీనియర్, టాలీవుడ్‌లో ఇప్పటికీ భౌతికంగా మిగిలి ఉన్న భీష్మ పితామహుడు మనకు దూరమైపోయారు. దాదాపు నాలుగైదు తరాలకు ప్రతినిధిగా నిలిచిన కైకాలను పోగొట్టుకున్నాం. హీరో, క్యారెక్టర్ ఆర్టిస్టు, కమెడియన్, విలన్.. ఒకటా రెండా.. ఆయన పోషించని పాత్ర అంటూ ఏమీ లేదు. కృష్ణుడు, రాముడు పాత్రలకు ఎన్టీఆర్ ఎలాగో.. యముడు, ఘటోత్కచుడు పాత్రలకు సత్యనారాయణ అలాగా.
కైకాల రాజకీయాల్లోకి వచ్చి మచిలీపట్నం నుంచి 11వ లోక్ సభకు ఎంపికయ్యారు. 'యమగోల', 'యమలీల' చిత్రాల్లో యముడిగా నటించి మెప్పించారు. రావణుడు, దుర్యోధనుడు, యముడు, ఘటోత్కచుడు... సాంఘికాలలో రౌడీ, హీరో తండ్రి, తాత పాత్రలు మొదలైనవి ఆయనకు కొట్టిన పిండి. ఆయన రమా ఫిల్మ్ ప్రొడక్షన్స్ అనే సంస్థను స్థాపించి కృష్ణ, శోభన్ బాబులు హీరోలుగా 'ఇద్దరు దొంగలు', చిరంజీవి హీరోగా 'కొదమసింహం', అక్కినేని నాగేశ్వరరావుతో 'బంగారు కుటుంబం', బాలకృష్ణతో 'ముద్దుల మొగుడు' వంటి చిత్రాలు నిర్మించారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఆయన సోదరుడు కైకాల నాగేశ్వరరావు సినీ నిర్మాతగా ప్రముఖుడు.
చివరిసారిగా 2019లో విడుదలైన 'మహర్షి' సినిమా తర్వాత సత్యనారాయణ నటనకి గుడ్ బై చెప్పేశారు. కారణం.. వృద్ధాప్యంతో ఆరోగ్యం సహకరించకపోవడం. కైకాల సత్యనారాయణ నట వారసత్వాన్ని ముందుకు కొనసాగించేందుకు తన కొడుకులను ఇండస్ట్రీలోకి ఎందుకు తీసుకుని రాలేదు?.. అనే సందేహం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. రావు గోపాలరావు కూడా రావు రమేష్ రూపంలో సినీవారసుడిని అందించారు. కానీ సత్యనారాయణ కుమారులు ఇద్దరికీ సినిమాల్లో నటించేందుకు ఆసక్తి లేకపోవడం వల్లే ఇండస్ట్రీకి రాలేదు. వ్యాపారంలో గొప్పగా రాణిస్తున్నారని సత్యనారాయణ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.
ఆయన పెద్ద కుమారుడు కైకాల లక్ష్మీనారాయణ మాత్రం సినిమా రంగంలోకి ఇటీవలనే అడుగుపెట్టారు. కన్నడతో పాటు పాన్ ఇండియా లెవల్లో సంచలన విజయం సాధించిన 'కేజిఎఫ్' సిరీస్ కు లక్ష్మీనారాయణ సహనిర్మాతగా వ్యవహరించారు. తెలుగులో రెండు భాగాలను ఆయనే స్వయంగా విడుదల చేశాడు. రెండు కూడా సంచన విజయం సాధించాయి. వందల కోట్ల రూపాయల లాభాలు కూడా వచ్చాయి. ఈ సినిమా టైటిల్స్ ముందు కైకాల సత్యనారాయణ సమర్పించు అని పడటం మనం గమనించే ఉంటాం. 'కేజిఎఫ్ 1', 'కేజీఎఫ్ 2' ద్వారా దాదాపు రూ. 170 కోట్లు సత్యనారాయణ కుమారుడికి వచ్చినట్టు తెలుస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



