'ధమాకా' ఓపెనింగ్స్.. అంచనాలకు మించి..!
on Dec 24, 2022

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన 'ధమాకా' చిత్రం శుక్రవారం విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఒక స్టార్ హీరోకి వరుసగా ఫ్లాప్లులు వస్తే వారి పనైపోయిందని భావిస్తారు. కానీ అది నిజం కాదు. మెగాస్టార్ చిరంజీవిని చూసుకుంటే రాజకీయాలలో బిజీగా ఉండి దాదాపు దశాబ్దం గ్యాప్ తీసుకున్నారు. కానీ తన 150వ చిత్రంగా 'ఖైదీ నెంబర్ 150'తో రీఎంట్రీ ఇచ్చినా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.
మన ఇండస్ట్రీలో స్టార్స్‌గా పేరొందిన నందమూరి నటసింహం బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్.. వీరంతా ఇదే కోవకి చెందుతారు. కావాలంటే వారి కెరీర్ గ్రాఫ్‌ని నిశితంగా పరిశీలిస్తే వరసగా అరడజను ఫ్లాప్‌లు వచ్చినా ఒక్క బ్లాక్‌బస్టర్ తో బౌన్స్‌బ్యాక్ అయి పూర్వ వైభవం తెచ్చుకున్న సంగతి అర్థమవుతుంది.
ఇప్పుడదే మాస్ మహారాజా రవితేజ విషయంలో కూడా నిరూపితం అవుతోంది. వరస ఫ్లాప్‌ల తర్వాత 'క్రాక్', మరలా రెండు వరస పరాజయాల తర్వాత 'ధమాకా' ఈ విషయాన్ని నిరూపిస్తున్నాయి. గడచిన కొద్ది సంవత్సరాలలో రవితేజ సినిమాకి మంచి హైప్ రావడం 'ధమాకా'కి జరిగింది. సాంగ్స్ సూపర్ హిట్ కావడం, టీజర్, ట్రైలర్ లకు అదిరిపోయే రెస్పాన్స్ రావడం వల్లనే సినిమాకి ఇంత మంచి బజ్ ఏర్పడింది. దానికి తగ్గట్టుగా టాక్ కూడా పాజిటివ్ గా రావడంతో ఓపెనింగ్స్ అంచనాలను మించాయి.
తెలుగు రాష్ట్రాల్లో రూ. 4 కోట్ల షేర్ రావచ్చని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేయగా, అంతకు మించి వసూళ్లు వచ్చాయి. తెలంగాణ ప్రాంతంలో రూ. 2.10 కోట్ల షేర్ రాబట్టిన 'ధమాకా', ఆంధ్రాలో రూ. 1.84 కోట్లు, రాయలసీమలో రూ. 0.72 కోట్లు.. వెరసి.. తెలుగునాట రూ. 4.66 కోట్ల షేర్ సాధించింది. వరల్డ్‌వైడ్‌గా చూసుకుంటే.. ఈ షేర్ రూ. 5.26 కోట్లు!
తెలుగు రాష్ట్రాల్లో 'ధమాకా' ప్రి బిజినెస్ వాల్యూ రూ. 16 కోట్లని అంచనా. అంటే తొలిరోజు అందులో సుమారు 33% రికవర్ అయ్యింది. శని, ఆదివారాలు కూడా ఇదే స్థాయిలో ఉంటే మూవీ బ్రేకీవెన్ అవడానికి ఛాన్స్ ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



