'హరిహర వీర మల్లు' కీలక అప్డేట్ వచ్చేసింది!
on Dec 20, 2021

పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'హరిహర వీర మల్లు'. ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ కి సంబంధించిన అప్డేట్ ని తాజాగా క్రిష్ అందించారు.
పవన్ కళ్యాణ్ తో కలిసి తాజాగా స్క్రిప్ట్ రీడింగ్ సెషన్ లో పాల్గొన్నట్లు క్రిష్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఈ సందర్భంగా పవన్ తో దిగిన ఫోటోని ఆయన పంచుకున్నారు. అలాగే, కొత్త సంవత్సవరంలో కొత్త షెడ్యూల్ ని ప్రారంభించనున్నామని చెప్పారు.
ఈ సినిమాను ఎ.ఎం. రత్నం సమర్పణలో ఆయన సోదరుడు దయాకర్ రావు నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరోవైపు సాగర్ కే చంద్ర దర్శకత్వంలో పవన్ నటిస్తోన్న సినిమా 'భీమ్లా నాయక్' జనవరి 12 న విడుదల కానుంది. ప్రస్తుతం పవన్ చేతిలో 'హరిహర వీర మల్లు'తో పాటు హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



