"నీయవ్వ.. ఇదికదా యాక్టింగ్ అంటే".. 'పుష్ప' విలన్ అజయ్ ఘోష్‌కు సుకుమార్ కాంప్లిమెంట్!
on Dec 20, 2021

అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ ఫిల్మ్ 'పుష్ప' బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్లతో దుమ్ము రేపుతోంది. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కొండారెడ్డి అనే విలన్ రోల్‌లో అజయ్ ఘోష్ ప్రదర్శించిన నటనకు అందరి నుంచీ ప్రశంసలు లభిస్తున్నాయి. ఎర్రచందనం స్మగ్లర్ అయిన కొండారెడ్డి దగ్గర కూలివాడిగా చేరిన పుష్ప, క్రమంగా అతని వ్యాపారంలో భాగస్వామిగా, ఆ తర్వాత తనే స్మగ్లర్‌గా మారతాడు. ఈ నేపథ్యంలో బన్నీ, అజయ్ ఘోష్ మధ్య పలు సన్నివేశాలు వస్తాయి. వీటిలో ఘోష్ ఉన్నతస్థాయి నటనను ప్రదర్శించారు. సుకుమార్ ఏరికోరి మరీ ఆ పాత్రను ఆయనచేత చేయించారు. ఈ సందర్భంగా బన్నీ నుంచి వచ్చిన కాంప్లిమెంట్ అజయ్ ఘోష్‌ను చాలా ఆనందపర్చింది.
Also read: బన్నీని ఆకాశానికెత్తేస్తూ ఊహించని కామెంట్స్ చేసిన సమంత!
తెలుగువన్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక సీన్ సందర్భంలో బన్నీ చెప్పిన ఒక మాటను ఆయన గుర్తుచేసుకున్నారు. "ఫిబ్రవరిలో మంచు భయంకరంగా కురుస్తా ఉంది. పఠాన్‌చెరువు మామిడితోటలో షూటింగ్. యూనిట్ మెంబర్స్ ఎవరికి వాళ్లే వణికి పోతున్నారు. చలిని తట్టుకోవడం కోసం కుంపట్లు పెట్టారు. నాకోసం సుకుమార్ ఒక టెంట్ వేయించి, అందులో కుంపటి పెట్టించారు. తెల్లవారుజాము మూడున్నర ప్రాంతం. నాకైతే కళ్లు తిరిగిపోతున్నాయి. అలాంటి టైమ్‌లో షాట్ పెట్టారు. మంగళం శ్రీను దగ్గరకెళ్లి మాట్లాడమని బన్నీకి నేను చెప్పే సీన్. ఆ డైలాగ్ చెప్పిన తర్వాత మానిటర్ దగ్గర్నుంచి వచ్చిన సుకుమార్, 'ఆయ్.. నీ యవ్వ. ఇదికదా అసలు యాక్టింగ్ అంటే. ఆట్.. నీ యవ్వ.. బాలేదంట.. బాలేదు. ఆయ్.. నీయవ్వ సూపర్' అన్నాడు చేతులతో విన్యాసాలు చేస్తా. అప్పుడు బన్నీ అన్నాడు, 'చాన్నాళ్ల తర్వాత మంచి ఆర్టిస్టుతో చేస్తున్నాను' అని. ఆ కాంప్లిమెంట్ చాలా బాగా అనిపించింది." అని చెప్పారు అజయ్ ఘోష్.
Also read: నిన్న 'రంగస్థలం'.. నేడు 'పుష్ప'.. సుకుమార్ సూపర్బ్ ఫీట్!
'పుష్ప' కంటే ముందు వచ్చిన మారుతి సినిమా 'మంచిరోజులు వచ్చాయి'లో హీరోయిన్ మెహ్రీన్ పిర్జాడా తండ్రిగా కామెడీ టచ్ ఉన్న రోల్‌ను ఆయన పోషించిన తీరుకు సర్వత్రా ప్రశంసలు లభించాయి. ఇప్పుడు మరోసారి మారుతి డైరెక్షన్‌లో గోపీచంద్ హీరోగా నటిస్తోన్న 'పక్కా కమర్షియల్'లో నెగటివ్ రోల్ చేస్తున్నారు అజయ్ ఘోష్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



