స్టార్ యాక్ట్రెస్ కంప్లయింట్‌తో డైరెక్టర్ అరెస్ట్
on May 5, 2022

సోషల్ మీడియాలో తనను వెంబడించి బెదిరించాడని మలయాళ నటి మంజు వారియర్ కేసు పెట్టడంతో డైరెక్టర్ సనల్ కుమార్ శశిధరన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శశిధరన్ తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని, సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా పరువు తీస్తున్నాడని కొచ్చిలోని ఎలమక్కర పోలీస్ స్టేషన్‌లో దాఖలు చేసిన ఫిర్యాదులో మంజు తెలిపారు. అతడిని అరెస్టు చేసిన పోలీసులు, అతను పోలీసు కస్టడీని ప్రతిఘటించిన లైవ్ వీడియోను ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు.
"వారు నా మొబైల్ ఫోన్ లాక్కోబోతున్నారు. నన్ను చాలా మంది కిడ్నాప్ చేస్తున్నారు. నాపై దాడి చేస్తున్నారు. కొందరు గూండాలు పోలీసులమని చెప్పుకుని నాపై దాడికి ప్రయత్నిస్తున్నారు. దయచేసి ఎవరైనా జోక్యం చేసుకుని నాకు సహాయం చేయండి" అని లైవ్‌లో చెప్పాడు సనల్.
కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో, 2017 నాటి మలయాళం నటుడు దిలీప్‌కు సంబంధం ఉన్న నటిపై దాడి కేసులో నటికి మద్దతు పలకడంతో మంజు వారియర్ ప్రమాదంలో ఉన్నారని, ఆమెకు బెదిరింపులు వస్తున్నాయని సనల్ రాసుకొచ్చాడు. మేనేజర్ చేతిలో బందీగా ఉన్నందున మంజు వారియర్ తన పబ్లిక్ పోస్ట్‌లకు జవాబు ఇవ్వడం లేదని కూడా అతను తెలిపాడు.
తనకు చట్టంపై లేదా పోలీసులపై నమ్మకం లేదంటూ ఆ దర్శకుడు 'ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్'కి ఫిర్యాదు చేశాడు. మహిళలకు సంబంధించి శాంతిభద్రతల పరిస్థితిపై ఆందోళనలను లేవనెత్తుతూ భారత రాష్ట్రపతికి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు కూడా రాశాడు.
మంజు వారియర్‌తో సనల్ కుమార్ 'కయ్యాట్టం' అనే చిత్రాన్ని రూపొందించాడు. 40 ఏళ్ల వయసులో హిమాలయాలకు ట్రెక్కింగ్‌కు వెళ్లిన ఒక స్త్రీ, జీవితం గురించిన ప్రశ్నలను ఎదుర్కోవడం ఈ చిత్రంలోని ప్రధానాంశం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



