గుడ్ న్యూస్.. 'కొమురం భీముడో' వీడియో సాంగ్ వచ్చేస్తుంది
on May 5, 2022
'ఆర్ఆర్ఆర్' సినిమాలోని సాంగ్స్ అన్నీ ఒకెత్తు అయితే 'కొమురం భీముడో' సాంగ్ మరో ఎత్తు. సినిమా విడుదలకు ముందు ఈ సాంగ్ అంతగా ఆదరణ పొందలేదు. కానీ సినిమా విడుదల తర్వాత ఎందరో ఈ సాంగ్ కి ఫిదా అయ్యారు. ఆ పాట చిత్రీకరించిన విధానం, అందులో భీమ్ గా జూనియర్ ఎన్టీఆర్ నటించిన తీరు అందరినీ కట్టిపడేసింది. అందుకే ఈ సాంగ్ ఫుల్ వీడియో కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా మూవీ టీమ్ 'కొమురం భీముడో' వీడియో సాంగ్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన సర్ ప్రైజ్ ఇచ్చింది.
'ఆర్ఆర్ఆర్' నుంచి ఇప్పటికే 'నాటు నాటు', 'దోస్తీ', 'కొమ్మా ఉయ్యాలా', 'ఎత్తర జెండా' వీడియో సాంగ్స్ విడుదలై అలరిస్తున్నాయి. మరోవైపు 'కొమురం భీముడో' వీడియో సాంగ్ కూడా త్వరగా విడుదల చేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా క్రేజీ అప్డేట్ వచ్చింది. 'కొమురం భీముడో' వీడియో సాంగ్ ని రేపు(మే 6 న) సాయంత్రం 4 గంటలకు విడుదల చేస్తున్నట్లు తాజాగా ప్రకటన వచ్చింది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రధారులుగా రాజమౌళి రూపొందించిన 'ఆర్ఆర్ఆర్' మార్చి 25 న సంచలన విజయాన్ని అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.1100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన ఈ మూవీ ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
