మంచి సినిమాలకు సీజన్ అంటూ ఏం ఉండదు
on Dec 6, 2022
'మళ్ళీ రావా', 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' వంటి విభిన్న కథలతో విజయాలను అందుకున్న స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో రూపుదిద్దుకున్న మూడో చిత్రం 'మసూద'. సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రంతో సాయికిరణ్ని దర్శకుడిగా పరిచయం చేశారు నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా. నవంబర్ 18న విడుదలైన మసూద నేటికీ విజయవంతంగా దూసుకుపోతోంది. ఈ సందర్భంగా రామానాయుడు స్టూడియోలో థాంక్యూ మీట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు దిల్ రాజు, రాజ్ కందుకూరి, బెక్కం వేణుగోపాల్, లగడపాటి శ్రీధర్, హీరో సుమంత్, సుహాస్, డైరెక్టర్ సందీప్ రాజ్, డైరెక్టర్ భరత్ కమ్మ, శుభలేఖ సుధాకర్ తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. "రాహుల్ యాదవ్ టేస్ట్ కు తగ్గట్టు కథను, దర్శకుడు గౌతమ్ ను సెలెక్ట్ చేసుకొని 'మళ్ళీ రావా' సినిమా చేసి హిట్ కొట్టాడు, ఆ తరువాత 'ఏజెంట్ ఆత్రేయ' సినిమా తీసి మళ్ళీ హిట్ కొట్టి, ఇప్పుడు 'మాసూద'తో హ్యాట్రిక్ హిట్ కొట్టడం అనేది గ్రేట్. ఒక నిర్మాత ప్రేక్షకుల టేస్ట్ కు తగ్గట్టు సినిమా తియ్యాలి అనుకుని, మంచి సంకల్పం తో సినిమాకు ప్రాణం పెట్టి తీస్తే హిట్ రిజల్ట్ వస్తాయి అని ఈ జనరేషన్ లో రాహుల్ ప్రూవ్ చేశాడు. తన హోమ్ బ్యానర్ లో వరుసగా మూడు సినిమాలు హిట్ సాధించిన రాహుల్ కు & టీం కు కంగ్రాట్స్. ఇక నుండి రాహుల్ ఈ సక్సెస్ ను కాపాడుకోవడం కూడా బిగ్ టాస్క్. నవంబర్ 18న 'మసూద' ఆ తరువాత 'లవ్ టుడే', 'హిట్ 2' ఇలా వరుసగా మూడు సినిమాలు హిట్ సాధించడం చూస్తుంటే ఇండస్ట్రీ కి మంచి రోజులు వచ్చాయి అనిపిస్తుంది. మంచి సినిమాలకు సీజన్ అంటూ ఉండదు. ఇలాంటి మంచి సినిమాలు వస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని 'మసూద' మళ్ళీ ప్రూవ్ చేసింది. రాహుల్ తన బ్యానర్ లో ఇలాంటి మంచి సినిమాలు చాలా తియ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అన్నారు.
హీరో సుమంత్ మాట్లాడుతూ.. "రాహుల్ తో గత ఆరు సంవత్సరాలనుండి జర్నీ చేస్తున్నాను. తన బ్యానర్ లో మెదటి సినిమా 'మళ్ళీ రావా' చేశాను. ఆ సినిమా నాకు మంచి పేరు తీసుకువచ్చింది. చాలా రోజుల తర్వాత రియలిస్టిక్ హారర్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి హ్యాట్రిక్ హిట్ సాధించిన రాహుల్ కు కంగ్రాట్స్ తెలియజేస్తున్నాను. ఇంత పెద్ద హిట్ సాధించిన మసూద టీం సభ్యులందరికీ కంగ్రాట్స్" అన్నారు
నిర్మాత రాహుల్ యాదవ్ మాట్లాడుతూ.. "మళ్ళీ రావా, ఏజెంట్ ఆత్రేయ సినిమాలు బిగ్ హిట్ అయిన తరువాత నెక్స్ట్ ఏం చేయాలి అనుకున్న టైమ్ లో 'మసూద' లాంటి స్క్రిప్ట్ ఇచ్చిన సాయికి బిగ్ థాంక్స్. ఈ స్క్రిప్ట్ పూర్తిగా చదివిన తరువాత ఈ కథకు నిర్మాతగా న్యాయం చేయగలుగుతానా లేదా, చివరి వరకు ఈ సినిమాను తీసుకెళ్ల గలిగే ఓపిక ఉందా లేదా అనుకున్నాను. అయితే నాకు సాయి ఫుల్ సపోర్ట్ చేశారు.ఈ సినిమాకు తిరువీర్ కరెక్ట్ యాప్ట్ అని సెలెక్ట్ చేసుకున్నాము. నిజంగా తను చాలా హార్డ్ వర్కర్. ఎన్ని హర్డిల్స్ వచ్చినా తట్టుకొని ఈ సినిమా కోసం గత మూడు సంవత్సరాలుగా ఏ సినిమా చేయకుండా మాతో జర్నీ చేస్తున్నాడు. నటీనటులు, టెక్నీషియన్స్ అందరూ మాకు ఫుల్ సపోర్ట్ చేయడంతో సినిమా బాగా వచ్చింది." అన్నారు.
చిత్ర దర్శకుడు సాయి కిరణ్ మాట్లాడుతూ.. 'ఏ సినిమాకైనా కథతో పాటు మంచి నటీనటులు , టెక్నిషియన్స్ చాలా అవసరం. అయితే ఈ సినిమాకు నిర్మాత రాహుల్ తనే సెలెక్ట్ చేసుకొని సినిమాటోగ్రఫీ పరంగా, మ్యూజిక్ పరంగా, ఆర్ట్ డైరెక్షన్, ఎడిటర్ ఇలా నాకు అద్భుతమైన టెక్నిషియన్స్ ను ఇచ్చాడు. సీనియర్ నటులు శుభలేఖ సుధాకర్ గారితో పని చేయడం చాలా సంతోషంగా ఉంది. తిరువీర్,సంగీత, మసూద అఖిల, భాందవి, కావ్య, సత్యం రాజేష్, కళ్యాణ్ ఇలా అందరూ చాలా బాగా సపోర్ట్ చేయడంతో సినిమా బాగా వచ్చింది. మా 'మసూద' సినిమాను ఇంత గ్రాండ్ సక్సెస్ చేసిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు" అన్నారు.