
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కాంబినేషన్ లో ఒక సినిమా రూపొందే అవకాశముందని ఇటీవల వార్తలొచ్చాయి. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ను దిల్ రాజు ప్రత్యేకంగా కలవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఇక తాజాగా దిల్ రాజు స్వయంగా ఈ న్యూస్ పై స్పందించారు.
దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేసిన రామాయణ, సీన్ సినిమాలు మంచి వసూళ్ళతో సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రెస్ మీట్ నిర్వహించి తన సంతోషాన్ని పంచుకున్నారు.
ఈ సందర్భంగా దిల్ రాజుకి పవన్ కళ్యాణ్ తో సినిమాకి సంబంధించిన ప్రశ్న ఎదురైంది. "పవన్ కళ్యాణ్ గారిని సినిమా కోసమే కలిశారా? 'ఓజీ 2' మీ కాంపౌండ్ లో ఉంటుందా?" అనే ప్రశ్న మీడియా నుంచి వచ్చింది.
ఇది కూడా చదవండి: బాక్సాఫీస్ ప్రభంజనం.. 8 రోజుల్లోనే 1000 కోట్ల క్లబ్‌లోకి ‘రామాయణ’.!
దానికి దిల్ రాజు బదులిస్తూ.. "పవన్ కళ్యాణ్ గారితో వకీల్ సాబ్ చేసిన ఓ నిర్మాతగా.. అవకాశముంటే ఆయనతో మరో సినిమా చేద్దామనే ఉద్దేశంతోనే కలిశాను. ఆ ఫొటోలో నా హ్యాపీనెస్ లోనే మీకు ఆన్సర్ దొరుకుతుంది. పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేస్తే అద్భుతంగా ఉండాలని అనుకుంటాను. ఆ దిశగానే అడుగులు వేస్తాను. అయితే కన్ఫర్మ్ అవ్వకుండా ఇప్పుడే పూర్తి వివరాలు చెప్పలేను." అన్నారు.
మీకు నచ్చవచ్చు:
‘వారణాసి’ స్టోరీ లీక్.. రావణుడి నవరత్నాల హారం చుట్టూ అసలు కథ.!
నిర్మాతగా మారుతున్న బాలయ్య కుమార్తె.. హీరో, డైరెక్టర్ ఎవరో తెలుసా.?
[Dil Raju, Pawan Kalyan, OG 2 Movie, Ramayana, Tollywood]




