సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమాతో పాటు ఇతర భాషల్లోనూ ఎన్నో అద్భుతమైన పాటలు, సంగీతాన్ని అందించారు. ముఖ్యంగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'ఆర్ఆర్ఆర్' సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమాలోని 'నాటు నాటు' పాటకు ఆస్కార్ అవార్డు అందుకొని తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటారు.
అయితే ఇప్పుడు కీరవాణి సంగీతం గురించి కాకుండా ఆయనలో వచ్చిన శారీరక మార్పు గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. కీరవాణి ఏకంగా 22 కిలోల బరువు తగ్గారు. ఒకప్పుడు కాస్త బొద్దుగా కనిపించిన ఆయన ఇప్పుడు చాలా స్లిమ్‌గా మారిపోయారు. తాజాగా బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
హైదరాబాద్ పర్యటనలో తన ఆప్తమిత్రుడు కీరవాణిని కలిసిన ఆయన.. గతంలో ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా మారిపోయారో తెలియజేస్తూ బిఫోర్, ఆఫ్టర్ ఫొటోలను షేర్ చేశారు. ఈ సందర్భంగా అనుపమ్ ఖేర్ కీరవాణిపై ప్రశంసలు కురిపించారు. ఏకంగా 22 కిలోల బరువు తగ్గడం వెనుక ఆయన పట్టుదల నిజంగా స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. కీరవాణిని కలిసినప్పుడు ఎంతో ఉత్సాహంగా, ఆత్మవిశ్వాసంతో కనిపించారని చెప్పారు.
ఆయన నడకలో కూడా కొత్త ఉత్సాహం కనిపించిందని, సంతోషంగా ఉన్న తన మిత్రుడిని చూసి ఎంతో గర్వంగా అనిపించిందని తెలిపారు. సంగీతంలో మేధావి అయిన కీరవాణి ఇప్పుడు ఏకాగ్రత, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించారని అనుపమ్ ఖేర్ కొనియాడారు. అనుపమ్ ఖేర్, కీరవాణి మధ్య మంచి స్నేహం ఉంది. గతంలో కూడా పలుమార్లు వీరిద్దరూ కలుసుకున్నారు.
ఇది కూడా చదవండి: బాలల దినోత్సవం కానుకగా బంపరాఫర్.. ఈ సినిమా టికెట్ రూ.150 మాత్రమే.!
2024 ఫిబ్రవరిలో అనుపమ్ ఖేర్ హైదరాబాద్ వచ్చినప్పుడు కీరవాణిని కలిశారు. ఆ సమయంలో ఫ్రెంచ్ టోస్ట్ తినడానికి తనను ఓ రెస్టారెంట్‌కు తీసుకెళ్లారని, అయితే అది మూసి ఉండటంతో నిరాశ చెందామని అనుపమ్ సరదాగా వెల్లడించారు. ఇప్పుడు మరోసారి హైదరాబాద్ పర్యటనలో కీరవాణిని కలుసుకొని ఆయనలో వచ్చిన మార్పును చూసి ఆశ్చర్యపోయారు.
ప్రస్తుతం కీరవాణి దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం 'వారణాసి'కి సంగీతం అందిస్తున్నారు. మరోవైపు అనుపమ్ ఖేర్ కూడా నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రామాయణ'లో జటాయువు పాత్రకు వాయిస్ అందించడంతో పాటు కథనంలో భాగమవుతున్నారు. మొత్తానికి 65 ఏళ్ల వయసులో కీరవాణి 22 కిలోల బరువు తగ్గడం, ఆయనలో వచ్చిన మార్పు చూసి అనుపమ్ ఖేర్ ప్రశంసించడం ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది.
మీకు నచ్చవచ్చు:
ఇష్టం లేని పెళ్లి.. భర్తపై మర్డర్ కేసు.. కీర్తి సురేశ్ కొత్త సినిమా కథ ఇదే!
రణబాలి: ఓటీటీలో ఊహించని రెస్పాన్స్.!
[MMKeeravani, AnupamKher, VaranasiMovie, SSRajamouli, MaheshBabu]






