వరకట్న వేధింపుల కేసులో బుక్కైన ప్రముఖ హీరో.. కేసు పెట్టిన భార్య
on Aug 19, 2025

ప్రముఖ సీనియర్ నటుడు 'శివబాలాజీ'(SIva Balaji)హీరోగా వచ్చిన చిత్రం 'సిందూరం'(Sindhooram). 2023 లో వచ్చిన ఈ చిత్రంలో మరో హీరోగా నటించడం ద్వారా తెలుగు సినీ రంగ ప్రవేశం చేసాడు 'ధర్మ' కాకాని(Dharma kakani). మొదటి సినిమాతోనే మంచి నటుడుగా గుర్తింపు పొందటంతో 'డ్రింకర్ సాయి'(Drinker Sai)చిత్రంలో సోలో హీరోగా అవకాశం వచ్చింది. గత ఏడాది డిసెంబర్ 27 న విడుదలవ్వగా, టైటిల్ రోల్ లో అద్భుతమైన పెర్ ఫార్మెన్స్ ని ప్రదర్శించాడు.
రీసెంట్ గా ధర్మ భార్య గౌతమి(Gowthami)హైదరాబాద్(Hyderabad)లోని గచ్చిబౌలి మహిళా పోలీస్ స్టేషన్(Gachibowli Mahila ps)లో ధర్మ పై కేసు నమోదు చేసింది. సదరు ఫిర్యాదులో 'సినిమా అవకాశాలు పెరిగిన తర్వాత 'ధర్మ' జల్సాలకి అలవాటుపడ్డాడు. దీంతో అదనపు కట్నం కోసం ధర్మతో పాటు ఆయన కుటుంబ సభ్యులు నన్ను వేధిస్తున్నారని గౌతమి తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు మహేశ్తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు.అయితే గతంలో కూడా ఇదే విషయంపై గౌతమీ ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు ధర్మకి కౌన్సిలింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
ధర్మ, గౌతమికి 2019లో వివాహం జరగగా, ఇద్దరికి ఒక కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతానికి 'డ్రింకర్ సాయి' తర్వాత ధర్మ ఎలాంటి చిత్రాల్లో కనిపించలేదు. పలు చిత్రాలు చర్చల దశలో ఉన్నట్టు ఫిలిం వర్గాల సమాచారం.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



