ENGLISH | TELUGU  

తెరపైకి వీర జవాన్ మురళి నాయక్ జీవిత కథ.. తండా ప్రజల హర్షం  

on Aug 18, 2025

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై దేశం కోసం ప్రాణాలర్పించిన వీర సైనికుల జీవిత కథలని మేకర్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ కోవలోనే గత ఏడాది 'మేజర్ ముకుంద్ వరదరాజన్'(Major Mukund varadarajan)జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'అమరన్'(Amaran)వచ్చి ప్రతి ఒక్క భారతీయుడిలో దేశభక్తిని మెండుగా నింపింది. దేశం కోసం తల్లితండ్రులని, భార్యా బిడ్డలని వదిలేసి,పోరాడిన తీరు ప్రతి ఒక్కరిని కంటతడి కూడా పెట్టించింది. 

ఈ కోవలోనే  'మే' 9 న పాకిస్థాన్ కి చెందిన తీవ్రవాదుల కాల్పుల్లో వీరమరణం పొందిన 'మురళి నాయక్'(Murali Nayak)జీవిత కథ ఆధారంగా చిత్రం తెరకెక్కుతుంది. టైటిల్ రోల్ ని  'సోలో బాయ్' మూవీ ఫేమ్  గౌతమ్ కృష్ణ(Gautham Krishna)పోషిస్తున్నాడు. ఈ మేరకు మేకర్స్ అధికారంగా తెలపడంతో పాటు, అందుకు సంబంధించి రిలీజ్ చేసిన 'పోస్టర్' బయోపిక్ ఏ స్థాయిలో రూపుదిద్దుకోబోతుందో చెప్తుంది.  విషాన్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పై కె.సురేష్ బాబు(K. Suresh Babu)పాన్, ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. మిగతా నటీనటుల వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. 

ఏప్రిల్ 22 న జమ్మూ కాశ్మీర్‌లోని 'పహల్ గామ్'(Pahal Gam)దగ్గర పాకిస్థాన్ కి చెందిన ఉగ్రవాదులు సుమారు 22 మందిని అత్యంత పాశవికంగా హత మార్చారు. ఇందుకు ప్రతిగా మన సైన్యం 'ఆపరేషన్ సిందూర్'(Operation sindoor)ని నిర్వచించి తీవ్రవాదులని మట్టుబెట్టడం జరిగింది. ఈ సంఘటనతో నియంత్రణ రేఖ వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. దీంతో మహారాష్ట్రలోని 'నాసిక్' వద్ద విధులు నిర్వహిస్తున్న  మురళి నాయక్ ని అధికారులు జమ్మూ కాశ్మీర్ కి పిలిపించారు. అక్కడి చేరుకున్న మురళి నాయక్ పాకిస్థాన్ తీవ్రవాదులని కొంత మందిని మట్టుబెట్టాడు. ఆ తర్వాత కాల్పుల్లో వీరమరణం పొందాడు. మురళి నాయక్ స్వస్థలం శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని కల్లి తండా. మురళి నాయక్ జీవిత కథ సినిమాగా రావడం పట్ల తండా వాసులు తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

 

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.