ధనుష్ వర్సెస్ శింబు!
on Jun 19, 2022

కోలీవుడ్ స్టార్స్ ధనుష్, శింబు బాక్సాఫీస్ వార్ కి సిద్ధమవుతున్నారా? అవునన్నదే తమిళ చిత్ర వర్గాల సమాచారం.
ఆ వివరాల్లోకి వెళితే.. మిత్రన్ జవహర్ దర్శకత్వంలో `తిరుచిత్రాంబలమ్` పేరుతో ఓ సినిమా చేస్తున్నాడు ధనుష్. మ్యూజికల్ కామెడీ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో ధనుష్ కి జంటగా నిత్యా మీనన్, రాశీ ఖన్నా, ప్రియా భవానీ శంకర్ నటిస్తుండగా.. ప్రకాశ్ రాజ్, భారతీరాజా ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. కోలీవుడ్ యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ బాణీలు అందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఆగస్టు 18న విడుదలకు సిద్ధమైంది.
కట్ చేస్తే.. అదే రోజు శింబు నటించిన `వెందు తణిందతు కాడు` రిలీజ్ కానుందని సమాచారం. ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ తెరకెక్కించిన ఈ యాక్షన్ డ్రామాలో సిద్ధీ ఇద్నాని నాయికగా ఎంటర్టైన్ చేయనుండగా రాధికా శరత్ కుమార్, సిద్ధిఖ్, నీరజ్ మాధవ్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. స్వరమాంత్రికుడు ఎ.ఆర్. రెహమాన్ ఈ సినిమాకి బాణీలు అందించారు. మరి.. ఒకే రోజున రానున్న ఈ చిత్రాలతో ధనుష్, శింబు ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



