సీనియర్ టాప్ స్టార్స్ - ఫ్రెష్ కాంబినేషన్స్!
on Jun 19, 2022

మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేశ్.. ఇలా టాలీవుడ్ సీనియర్ స్టార్స్ అంతా రాబోయే చిత్రాల కోసం దర్శకుల పరంగా ఫ్రెష్ కాంబినేషన్స్ తో ఎంటర్టైన్ చేయనున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..
చిరంజీవి:
గత చిత్రం `ఆచార్య` కోసం కొరటాల శివతో తొలిసారిగా జట్టుకట్టిన చిరంజీవి - విడుదలకు సిద్ధమైన `గాడ్ ఫాదర్` కోసం మోహన్ రాజాతో మొదటిసారిగా కలిసి పనిచేస్తున్నారు. అలాగే `మెగా 154` కోసం బాబీ, `భోళా శంకర్` కోసం మెహర్ రమేశ్ తోనూ ఫస్ట్ టైమ్ టీమ్ అప్ అయ్యారు. ఆపై వెంకీ కుడుములతోనూ తొలిసారి వర్క్ చేయబోతున్నారు చిరు.
బాలకృష్ణ:
బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో ఓ సినిమా చేస్తున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఇదే మొదటి సినిమా. ఆనక అనిల్ రావిపూడితో ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు బాలయ్య. ఇది కూడా ఫ్రెష్ కాంబినేషన్ నే.
నాగార్జున:
మరో సీనియర్ స్టార్ నాగార్జున ప్రస్తుతం `ద ఘోస్ట్`లో హీరోగా నటిస్తున్నారు. దీనికి `గరుడ వేగ` ఫేమ్ ప్రవీణ్ సత్తారు కెప్టెన్. ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఇదే ఫస్ట్ ప్రాజెక్ట్. ఇక హిందీ చిత్రం `బ్రహ్మాస్తః పార్ట్ వన్ శివ` కోసం కూడా దర్శకుడు అయన్ ముఖర్జీతో తొలిసారి జట్టుకట్టారు నాగ్. ఇందులో నాగార్జున ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు.
వెంకటేశ్:
వెంకటేశ్ త్వరలో సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్ లో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. దీనికి `జాతిరత్నాలు` ఫేమ్ అనుదీప్ దర్శకత్వం వహిస్తాడని ప్రచారం సాగుతోంది. అదే గనుక నిజమైతే.. వెంకీ - అనుదీప్ రూపంలో మరో ఫ్రెష్ కాంబినేషన్ ఎంటర్టైన్ చేయబోతున్నట్లే. ఇక హిందీ చిత్రం `కబీ ఈద్ కబీ దివాళి` కోసం ఫర్హాద్ సామ్జితో మొదటిసారిగా జట్టుకట్టారు వెంకీ. ఇందులో వెంకటేశ్ స్పెషల్ రోల్ లో వినోదాలు పంచనున్నారు.
మరి.. ఈ ఫ్రెష్ కాంబినేషన్స్ తో మన సీనియర్ స్టార్స్ ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



