'ధమాకా' ప్రభంజనం.. 'క్రాక్'ని మించిన కలెక్షన్స్!
on Dec 26, 2022

మాస్ మహారాజా తాజా చిత్రం 'ధమాకా' అదిరిపోయే కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. రవితేజ సూపర్ హిట్ ఫిల్మ్ 'క్రాక్'ని మించిన కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. మూడో రోజు మొదటి రోజుని మించి వసూళ్లు రాబట్టడం విశేషం.
తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ.4.66 కోట్ల షేర్, రెండో రోజు రూ.3.53 షేర్ రాబట్టిన రాబట్టిన ధమాకా.. మూడో రోజు ఏకంగా రూ. 5.18 కోట్ల షేర్ తో సత్తా చాటింది. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి మూడు రోజుల్లో రూ.13.37 కోట్ల షేర్ వసూలు చేసింది. ఏరియాల వారీగా చూస్తే.. ఇప్పటిదాకా నైజాంలో రూ.6 కోట్ల షేర్, సీడెడ్ లో రూ.2.25 కోట్ల షేర్, ఆంధ్రాలో రూ.5.12 కోట్ల షేర్ సాధించింది.
ధమాకా చిత్రం మూడు రోజుల్లో.. రెస్టాఫ్ ఇండియా రూ.1.10 లక్షల షేర్, ఓవర్సీస్ లో రూ.90 లక్షల షేర్ కలెక్ట్ చేసింది. క్రాక్ మూవీ వరల్డ్ వైడ్ గా మూడు రోజుల్లో రూ.13.56 కోట్ల షేర్ రాబడితే.. ధమాకా అంతకుమించి రాబట్టడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు రూ.5.46 కోట్ల షేర్, రెండో రోజు రూ.3.98 కోట్ల షేర్, మూడో రోజు రూ.5.93 కోట్ల షేర్ రాబట్టింది. మూడు రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ.15.37 కోట్ల షేర్ సాధించింది. రొటీన్ కమర్షియల్ ఫిల్మ్ గా టాక్ తెచ్చుకున్న ధమాకా మూడో రోజు అంచనాలకు మించిన వసూళ్లతో ట్రేడ్ వర్గాలనే ఆశ్చర్యపరిచింది. దాదాపు రూ.18 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ మూవీ ఈ వారంలోనే బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశముందని ట్రేడ్ వర్గాల అంచనా.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



