సందీప్ రెడ్డి వంగాతో దేవర.. మామూలు రచ్చ కాదు!
on Sep 9, 2024
'దేవర' (Devara) ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. సెప్టెంబర్ 10న ముంబైలో ట్రైలర్ లాంచ్ జరగనుంది. దీనికోసం ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ముంబై వెళ్ళాడు. ఈ క్రమంలో సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాను ముంబైలో ఎన్టీఆర్ మీట్ కావడం ఆసక్తికరంగా మారింది. (Jr NTR Meets Sandeep Reddy Vanga)
'అర్జున్ రెడ్డి' వంటి సంచలన చిత్రంతో టాలీవుడ్ కి డైరెక్టర్ గా పరిచయమైన సందీప్ రెడ్డి.. ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్లి అక్కడా సంచలనాలు సృష్టిస్తున్నాడు. 'అర్జున్ రెడ్డి'కి రీమేక్ గా 'కబీర్ సింగ్' చేయగా బ్లాక్ బస్టర్ అయింది. ఇక గతేడాది 'యానిమల్' అనే మూవీ డైరెక్ట్ చేయగా.. ఏకంగా రూ.900 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి పాన్ ఇండియా వైడ్ గా ఓ రేంజ్ సౌండ్ చేసింది. ఇక తన నెక్స్ట్ మూవీ 'స్పిరిట్'ని ప్రభాస్ తో చేయనున్నాడు. ఇలా అతికొద్ది కాలంలోనే పాన్ ఇండియా వైడ్ గా సంచలనాలు సృష్టిస్తున్న సందీప్ రెడ్డిని ఎన్టీఆర్ కలవడం హాట్ టాపిక్ గా మారింది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా పడితే.. బాక్సాఫీస్ షేక్ అయ్యి, సరికొత్త రికార్డులు క్రియేట్ కావడం ఖాయమంటూ అప్పుడే చర్చలు కూడా మొదలయ్యాయి.
అయితే ఎన్టీఆర్, సందీప్ రెడ్డి మీటింగ్ అనేది సినిమా చేయడానికి కాదని.. 'దేవర' ప్రమోషన్స్ కోసమని తెలుస్తోంది. 'దేవర' హిందీ ప్రమోషన్స్ లో సందీప్ రెడ్డి భాగం కాబోతున్నాడట. హిందీ ఆడియన్స్ కోసం సందీప్ హోస్ట్ గా మారి ఎన్టీఆర్ ని ఇంటర్వ్యూ చేస్తున్నాడట. ఈ క్రమంలోనే ఇద్దరు మీట్ అయినట్లు సమాచారం. ఎన్టీఆర్, సందీప్ కలిసిన ఫొటో ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పిక్ లో ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. కేవలం ఈ ఇద్దరు కలిస్తేనే సోషల్ మీడియాలో ఇంత చర్చ జరుగుతుందంటే.. ఇక ఇద్దరు కలిసి సినిమా అనౌన్స్ చేస్తే ఏ రేంజ్ హంగామా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
Also Read