దీపికా పదుకునే ఆడబిడ్డకి జన్మనిచ్చింది..కల్కి లో మాత్రం అబ్బాయే
on Sep 9, 2024

ప్రముఖ హీరోయిన్ దీపికా పదుకునే(deepika padukone)కల్కి(kalki 2898 ad)లో గర్భిణీ క్యారక్టర్ లో చేసిన దగ్గర్నుంచి, నిజ జీవితంలో కూడా దీపికా గర్భిణీ గా ఉంది కాబట్టి ఎవర్ని కంటుందా అనే ఆసక్తి అందరిలో ఏర్పడింది. ఈ నేపథ్యంలో నిన్న డెలివరీ అయ్యింది.
వినాయక చవితి రోజైన శనివారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో దీపిక తన తల్లి ఉజ్జల పదుకొనేతో కలిసి ముంబైలోని రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యింది.అందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యాయి.ఇక ఆదివారం ఉదయం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో భర్త రణవీర్ సింగ్(ranveer singh)తో పాటు కుటుంబ సభ్యుల్లో ఆనందం వెళ్లి విరుస్తుంది. సోషల్ మీడియా వేదికగా అభిమానులు దీపిక, రణ్‌వీర్ సింగ్ కు విషెస్ చెబుతున్నారు.తల్లీ బిడ్డా ఇద్దరు క్షేమంగా ఉన్నట్లు ఆస్పత్రి వైద్యులు కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసారు.హాస్పిటల్ లో జాయిన్ అయ్యే రెండు రోజుల ముందు దంపతులిద్దరు ముంబై లోని సిద్ధివినాయక ఆలయాన్ని సందర్శించారు. తమ కుటుంబంలోకి కొత్తగా అడుగుబెట్టబోతున్న బేబీకి మంచి ఆరోగ్యాన్ని అందించాలని గణేశుడ్ని ప్రార్థించారు.
ప్రఖ్యాత దర్సకుడు సంజయ్ లీలా భన్సాలీ 2013 లో తెరకెక్కించిన రామ్ లీలా లో దీపికా, రణ్‌వీర్ లు కలిసి ఫస్ట్ టైం వర్క్ చేసారు.ఆ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ పుట్టింది. ఆ తర్వాత ఇరు కుటుంబ పెద్దల అంగీకారంతో 2018 లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



