అలాంటోడు మళ్ళీ తిరిగొస్తున్నాడు.. యూఎస్ లో 'దేవర' రికార్డుల ఊచకోత!
on Sep 8, 2024
సెప్టెంబర్ 27న విడుదల కావాల్సిన 'దేవర' (Devara) మూవీ అప్పుడే రికార్డుల వేట మొదలుపెట్టింది. ఇప్పటికే ఓవర్సీస్ లో కొన్ని చోట్ల బుకింగ్స్ ఓపెన్ కాగా సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా యూఎస్ఏ ప్రీమియర్ ప్రీ సేల్స్ పరంగా 'దేవర' సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. (Devara USA Premiere Sales)
జానర్ తో సంబంధం లేకుండా యూఎస్ లో మంచి వసూళ్లు రాబట్టే హీరోలలో ఎన్టీఆర్ ఒకరు. 'దేవర'తో అది మరోసారి రుజువు అవుతోంది. యూఎస్ఏ ప్రీమియర్ ప్రీ సేల్స్ లో ఇండియన్ సినిమాల పరంగా వేగంగా 15,000 టికెట్లు, 20,000 టికెట్లు, 25,000 టికెట్లు బుక్ అయిన సినిమాగా 'దేవర' నిలిచింది. ఇక కలెక్షన్ల పరంగా ఇప్పటికే దాదాపు 800K డాలర్లు రాబట్టి, 1 మిలియన్ కి చేరువైంది. ప్రీమియర్లకు 18 రోజుల ముందే 'దేవర' ఈ ఫీట్ సాధించడం విశేషం.
యూఎస్ లోనే ఈ రేంజ్ రెస్పాన్స్ వస్తుందంటే.. ఇక తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ ఓపెన్ అయ్యాక ఏ రేంజ్ రెస్పాన్స్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అసలే ఎన్టీఆర్ కి 'కింగ్ ఆఫ్ ఓపెనింగ్స్' అనే పేరుంది. దానికి తోడు దాదాపు ఆరేళ్ళ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సోలో ఫిల్మ్ కావడంతో.. 'దేవర'ను మొదటిరోజే చూడాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఈ లెక్కన 'దేవర' మూవీ మొదటిరోజే వరల్డ్ వైడ్ గా రూ.150 కోట్ల గ్రాస్ రాబట్టినా ఆశ్చర్యం లేదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
Also Read