షాకింగ్.. ప్రముఖ నిర్మాత అనుమానాస్పద మృతి!
on Sep 9, 2024
కోలీవుడ్ ప్రముఖ నిర్మాత ఢిల్లీ బాబు (50) కన్నుమూశారు. ఈరోజు (సెప్టెంబర్ 9) తెల్లవారుజామున చెన్నైలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఢిల్లీ బాబు హఠాన్మరణంతో తమిళ చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా షాక్ కి గురైంది. అంతేకాదు ఆయన మరణానికి గల కారణం ఏంటో ఇంకా స్పష్టంగా తెలియడంలేదు. సన్నిహిత వర్గాలు మాత్రం, ఢిల్లీ బాబు కొద్దిరోజులుగా అనారోగ్యంగా బాధపడుతున్నారని, చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని చెబుతున్నారు. అయితే అసలు ఆయనకు వచ్చిన అనారోగ్య సమస్య ఏంటనే దానిపై ఇంకా స్పష్టత లేదు. (Producer Dilli Babu Passes Away)
కాగా, తమిళ సినీ పరిశ్రమలో మంచి అభిరుచి నిర్మాతగా ఢిల్లీ బాబుకి పేరుంది. తమిళ్ లో ఘన విజయం సాధించిన క్రైమ్ థిల్లర్ 'రాక్షసన్'కి నిర్మాత ఆయనే. ఈ సినిమా 'రాక్షసుడు'గా తెలుగులో రీమేక్ అయింది. అలాగే 'ఓ మై కడవులే', 'బ్యాచిలర్', 'మరకతమణి', 'మిరల్', 'కాల్వన్' వంటి చిత్రాలను ఢిల్లీ బాబు నిర్మించారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
