'దసరా' వసూళ్ల ఊచకోత.. అంచనాలకు మించి ఓపెనింగ్స్!
on Mar 31, 2023
'దసరా'తో నేచురల్ స్టార్ నాని సంచలనం సృష్టించాడు. మొదటి రోజు ఈ చిత్రం అంచనాలకు మించిన కలెక్షన్స్ తో సత్తా చాటింది. వరల్డ్ వైడ్ గా ఈ మూవీ రూ.15 కోట్లకు పైగా షేర్ రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేయగా.. ఏకంగా రూ.20 కోట్లకు పైగా షేర్ రాబట్టడం విశేషం.
మొదటి రోజు నైజాంలో రూ. 6.78 కోట్ల షేర్, సీడెడ్ లో రూ.2.36 కోట్ల షేర్, ఆంధ్రాలో రూ.5.08 కోట్ల షేర్ వసూలు చేయగా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి మొత్తంగా రూ.14.22 కోట్ల షేర్(రూ.24.85 కోట్ల గ్రాస్)తో సత్తా చాటింది. ఇక కర్ణాటక+ రెస్టాఫ్ ఇండియా రూ.2.58 కోట్ల షేర్, ఓవర్సీస్ లో రూ.4.20 కోట్ల షేర్ తో ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా రూ.21 కోట్ల షేర్(రూ.38.40 కోట్ల గ్రాస్) కలెక్ట్ చేసిందని అంచనా.
దసరా ఓవరాల్ థియేట్రికల్ బిజినెస్ వాల్యూ రూ.48 కోట్లు కాగా.. రూ.49 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగింది. మొదటి రోజే రూ.21 కోట్ల షేర్ తో 43 శాతం రికవరీ చేసింది. ఇదే జోరు కొనసాగితే ఈ చిత్రం మొదటి వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ సాధించినా ఆశ్చర్యం లేదు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
