దర్శన్ కి ఉరిశిక్ష విధించండని కోర్టులో వ్యక్తి గొడవ.. కోర్టు రియాక్షన్ ఇదే
on Sep 3, 2025

రేణుక స్వామి(Renukaswami)ని చంపిన కేసులో ప్రముఖ కన్నడ హీరో 'దర్శన్'(Darshan),హీరోయిన్ 'పవిత్ర గౌడ్'(Pavithra Gowda)కి మంజూరైన బెయిల్ ని ఇటీవల సుప్రీంకోర్ట్ రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో దర్శన్, పవిత్ర గౌడ లని అరెస్ట్ చేసి బెంగుళూరు(Bengaluru)లోని 'పరప్పన అగ్రహార జైలు'కి తరలించారు. దర్శన్ మొదట నుంచి బళ్లారి జైలులో ఉన్నాడు. దీంతో అక్కడి జైలుకి మార్చాలని అధికారులు బెంగళూరులోని 64వ సెషన్స్ కోర్టులో పిటిషన్‌ని దాఖలు చేసారు.
నిన్న ఈ పిటిషన్ విచారణకి వచ్చింది. విచారణ జరుగుతున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి చేతిలో ఒక పిటిషన్ తో కోర్టు హాలులోకి చొరబడ్డాడు. జడ్జితో పెద్దగా మాట్లాడుతు 'దర్శన్ తో పాటు, ఈ కేసులో సంబంధం ఉన్న ఎవరకి బెయిల్ మంజూరు చేయకండి, దర్శన్‌కి మరణశిక్ష విధించాలని అభ్యర్థించాడు. ఈ ఊహించని పరిణామంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. అనంతరం జడ్జి మాట్లాడుతు నువ్వు ఎవరు అని అడిగారు.ఆ వ్యక్తి తన పర్సనల్ విషయాలు చెప్పగానే, ఎవరో సమర్పించిన దరఖాస్తుని అంగీకరించలేను. కేసు ఏదైనా సరే, ఆ వ్యక్తి పిటీషన్ కి దరఖాస్తు తీసుకుంటేనే స్వీకరిస్థాను. ఈ కేసుకి సంబంధించిన అన్ని చట్టపరమైన చర్యలు నిబంధనల ప్రకారం జరగాలి. బయటి వ్యక్తుల జోక్యాన్ని అనుమతించబోనని న్యాయమూర్తి స్పష్టం చేశారు. దీంతో సదరు వ్యక్తి కోర్టు గది నుంచి వెళ్లిపోయాడు.
దర్శన్ అభిమాని అయిన రేణుక స్వామి హత్య గత ఏడాది జూన్ 8 న జరిగింది. పవిత్ర గౌడ కి రేణుక స్వామి అసభ్య మెసేజెస్ పంపిస్తున్నాడనే కారణంతో, దర్శన్ మరి కొంత మంది తో కలిసి అత్యంత దారుణంగా చంపాడు. ఈ కేసుకి సంబంధించి మొత్తం పదిహేను మంది నిందితులుగా ఉన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



