చినజీయర్ స్వామి చెంతకు పూరి, ఛార్మి
on Sep 4, 2025

దర్శకుడిగా 'పూరిజగన్నాధ్' (Puri Jagannadh)శైలి ఎంతో విభిన్నం. తెలుగు సినిమాకి ఒక కొత్త తరహా సబ్జెట్స్ ని పరిచయం చేసిన ఘనత కూడా పూరి సొంతం. కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకున్న పూరి, తన గత చిత్రాలైన లైగర్, డబుల్ ఇస్మార్ట్ తో పరాజయాలని అందుకున్నాడు. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్ ని అందుకోవాలని 'విజయ్ సేతుపతి'(Vijay Sethupathi)తో పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. టబు, సంయుక్త మీనన్, దునియా విజయ్ కుమార్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని పూరి, ఛార్మి(Charmme Kaur)నిర్మిస్తున్నారు.
పూరి సోషల్ మీడియా వేదికగా అభిమానుల కోసం 'పూరి కనెక్ట్'(Puri Connect)అనే ప్రోగ్రాంని నిర్వహిస్తుంటాడనే విషయం తెలిసిందే. అందులో రకరకాల అంశాలపై తన విశ్లేషణని ఇస్తుంటాడు. ఆ ప్రోగ్రాం ఫాలో అయ్యే వాళ్ళకైనా, పూరి గత స్పీచ్ లు చూసినవారికైనా, పూరి దేవుడ్ని నమ్మడనే విషయం అర్ధమవుతుంది. కానీ పూరి తాజాగా ఛార్మితో కలిసి, 'హైదరాబాద్', 'ముచ్చింతల్'లో ఉన్న 'చినజీయర్ స్వామి' ఆశ్రమానికి వెళ్లి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఈ విషయాన్నీ 'పూరి టీమ్' సోషల్ మీడియా ద్వారా తెలియ చేసింది. రామానుజాచార్యుల ఐక్యత, సమానత్వం, కరుణ యొక్క కాలాతీత సందేశం' అనే పోస్ట్ తో కొన్ని ఫోటోలని కూడా షేర్ చేసింది.
సదరు పిక్స్ లో పూరీ, ఛార్మీ నుదుటిన తిరునామాలు ధరించి, భక్తి శ్రద్ధలతో చిన్నజీయర్ స్వామి(Chinna Jeeyar Swamy)బోధనలు వింటున్నారు. మరో పిక్ లో రామానుజాచార్య 'స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ'ని సందర్శించారు. దేవుడ్ని పెద్దగా నమ్మని పూరీ, చిన్న జీయర్ స్వామిని కలవడం, నుదుటిన వేంకటనాధుని తిరు నామాలు ధరించి కనిపించడం వైరల్ గా మారింది. మారిన పూరి, దేవుడు ఉన్నాడు అనే కామెంట్స్ సోషల్ మీడియా వేదికగా పలువురు నెటిజన్స్ చేస్తున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



