కూలీ ప్రీ సేల్స్ ప్రభంజనం.. ఫస్ట్ మూవీగా రికార్డు
on Aug 12, 2025

సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth),కింగ్ నాగార్జున(Nagarjuna),అమీర్ ఖాన్(Aamir Khan),ఉపేంద్ర(Upendra),లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj)వంటి స్టార్స్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'కూలీ'(Coolie)ఈ నెల 14 న వరల్డ్ వైడ్ గా తన సత్తా చాటడానికి సిద్దమవుతుంది. లోకేష్ గత చిత్రం 'లియో' అంతగా ఆడకపోవడంతో ఈ సారి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా, తన మార్క్ అంశాలన్నిటినీ లోకేష్ కూలీలో పొందుపరిచాడు. ప్రమోషన్స్ సందర్భంగా రజనీ, నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర, కూలీ గురించి చెప్తున విషయాలు అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను కూలీపై అంచనాలు పెంచేలా చేసాయి.
కూలీ 'యూఎస్'(us)మార్కెట్ లో ప్రీ సేల్స్ కి సంబంధించి రెండు మిలియన్ డాలర్స్ ని సాధించింది. దీంతో ఇప్పటి వరకు యుఎస్ లో రిలీజైన అన్నితమిళ సినిమాల్లోనే హయ్యస్ట్ మార్క్ ని అందుకున్న మొదటి సినిమాగా నిలిచింది. దీంతో యుఎస్ లో 'కూలీ'కి ఉన్న క్రేజ్ ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు. మరి ప్రీ రిలీజ్ లోనే రికార్డు కలెక్షన్స్ సాధిస్తే, మూవీకి హిట్ టాక్ వస్తే మరిన్ని సంచలన రికార్డులు నెలకొల్పుతుందని అభిమానులు నమ్ముతున్నారు.
కూలీ తమిళనాడు తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఆగస్టు 13 నుంచే ప్రీమియర్స్ తో సందడి చేయనుంది. రిలీజ్ రోజున తమిళనాడులోని చాలా వ్యాపార, ఉద్యోగ సంస్థలు సెలవుని ప్రకటించినట్టుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. శృతి హాసన్(Shruthi Haasan)సత్యరాజ్, రుచిత రామ్, సౌబిన్ షాహిర్ కీలక పాత్రలో కనిపిస్తుండగా, పూజాహెగ్డే(Pooja Hegde)ప్రత్యేక గీతంలో మెరిసింది. అనిరుద్ సంగీత సారధ్యంలో తెరకెక్కిన సాంగ్స్ సోషల్ మీడియాలో రికార్డు వ్యూస్ ని రాబడుతున్నాయి .తెలంగాణాలో కూలీ టికెట్స్ రేట్స్ ని పెంచుకోవడానికి కూలీని తెలంగాణలో విడుదల చేస్తున్న దిల్ రాజు ప్రభుత్వం అనుమతి కోరగా,అనుమతి ని నిరాకరించింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



