Home

»

Latest News

టాలీవుడ్ లో మరో విషాదం.. ఫిష్ వెంకట్ కన్నుమూత!

Jul 18, 2025

 

తెలుగు సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఇటీవల లెజెండరీ యాక్టర్స్ కోట శ్రీనివాసరావు, బి. సరోజాదేవి మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు తుదిశ్వాస విడిచారు. (Fish Venkat)

 

ఫిష్ వెంకట్ కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. ఆయన రెండు కిడ్నీలు పాడైపోయాయని, ఆరోగ్యం బాగా క్షీణించిందని ఇటీవల వార్తలొచ్చాయి. కుటుంబ సభ్యులు కూడా వెంకట్ ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తం చేశారు. కొద్దిరోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. శుక్రవారం కన్నుమూశారు.

 

ఫిష్ వెంకట్ అసలు పేరు మంగిలంపల్లి వెంకటేష్. ఆయన మొదట్లో ముషీరాబాద్‌లో చేపల వ్యాపారం చేసేవారు. దానితో అందరూ ఫిష్ వెంకట్ అని పిలిచేవారు. 2000 లో సినీ పరిశ్రమలోకి వచ్చిన ఆయన.. దాదాపు వంద సినిమాల్లో నటించారు. 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com