విజయ్ సాయి ఆత్మహత్య..? దోషి ఎవరు..?
on Dec 11, 2017

కమెడియన్ విజయ్ సాయి ఆత్మహత్యతో టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గతంలో చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు వరుసగా మరణించడం.. ఆ విషాదం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వేళ.. విజయ్ సూసైడ్ తెలుగు చిత్ర పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మరోవైపు విజయ్ సాయి ఆత్మహత్య వ్యవహారం గంటకో మలుపు తిరుగుతోంది. చనిపోయే చివరి క్షణంలో అతను సెల్పీ వీడియో తీసుకున్నాడని.. అందులో తన చావుకి భార్య వనితారెడ్డితో పాటు నవయుగ డైరెక్టర్ శశిథర్, అడ్వకేట్ శ్రీనివాస్ కారణమని వీడియోలో పేర్కొన్నాడట.
మ్యారేజ్ తర్వాత తన భార్య గురించి అనేక వాస్తవాలు తెలిశాయని.. చివరకు పాపను కూడా చూడటం లేదని.. వాళ్లు పెట్టే టార్చర్ భరించలేకపోతున్నానని అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్పీ వీడియో తెలిపాడట. దీనికి బలం చేకూరుస్తూ కోడలి కారణంగానే తన కొడుకు చనిపోయాడని.. సినిమాల్లో అవకాశాలు లేకపోవడం వల్ల కాదని విజయ్ తండ్రి ఆరోపించారు.
అయితే భర్త మరణవార్త తెలుసుకున్న వనితారెడ్డి ఉస్మానియా ఆసుపత్రికి వచ్చారు. తానెప్పుడూ భర్తను ఇబ్బంది పెట్టలేదని.. విజయ్‌కి వేరే అమ్మాయిలతో సంబంధాలున్నాయని.. దానిని కళ్లారా చూశాకే విడాకులు అడిగానని ఆమె చెప్పారు. ఇలాంటివి వద్దన్నందుకు నన్ను తరచు చిత్రహింసలు పెట్టేవాడని ఆరోపించారు. సినిమాల్లో అవకాశాలు బాగానే ఉన్నాయని తండ్రి చెబుతుండగా.. నేను ఎప్పుడు సాయిని వేధించలేదని భార్య చెబుతోంది. కానీ సూసైడ్ వీడియో భార్యనే దోషిగా నిలబెడుతోంది. మరి విజయ్ సాయి బలవన్మరణానికి అసలు కారణం ఎవరు అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



