యండమూరి మళ్లీ కెలికాడు.. చెర్రీ పొట్టొడట
on Dec 11, 2017
.jpg)
స్టార్ రైటర్ యండమూరి వీరేంద్రనాథ్, మెగాస్టార్ చిరంజీవి మధ్య అనుబంధం ఎలాంటిదో తెలుగు చిత్ర సీమలో ఎవరిని అడిగినా చెబుతారు. 80, 90 దశకాల్లో యండమూరి రాసిన ఎన్నో కథల్లో చిరునే హీరో.. ఆ సినిమాలన్ని బ్లాక్‌బస్టర్లు కావడంతో వీరిద్దరిని హిట్ పెయిర్ అనే వారు ఆ రోజుల్లో. వయసు రీత్యా సినిమాలకు దూరమైనా మెగా ఫ్యామిలీతో ఫ్రెండ్‌షిప్‌ను కంటిన్యూ చేస్తూనే ఉన్నారు యండమూరి. అలాంటి వీరేంద్రనాథ్ మెగా వారసుడు రామ్‌చరణ్‌పై అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేయడం దుమారం రేపింది.
చెర్రీని హీరోగా చేయడం కోసం సురేఖ ఎంతో కష్టపడేది.. అయితే ఆ అబ్బాయి దవడ సరిగా ఉండకపోవడంతో.. సర్జరీ చేయించారు అని అనేశాడు. ఈ వ్యాఖ్యలపై మెగా అభిమానులు కారాలు మిరియాలు నూరారు.. చివరికి ఖైదీ నెంబర్ 150 ఆడియో లాంఛ్ సందర్భంగా నాగబాబు కూడా యండమూరికి కౌంటరిచ్చాడు. ఆ తర్వాత ఈ గొడవ సద్దుమణిగిందనుకోండి.. అయితే ఇంతకాలం తర్వాత మళ్లీ ఆ పాత గొడవను లేపారు యండమూరి.
ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఒక హీరో ముక్కు, కళ్లు, దవడ సరిచేయించుకున్నాడని అంత డైరెక్ట్‌గా అంటే ప్రేక్షకులు ఏమనుకుంటారు అని అడగ్గా.. అలా ఎందుకు.. ఓ పొట్టివాడు హీరో అయ్యాడు అనుకోవచ్చు కదా అంటూ చరణ్‌ని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు వీరేంద్రనాథ్. అయినా రూపురేఖలు వర్ణించడం తప్పు కాదని.. గతంలో శ్రీదేవి ముక్కు గురించి మాట్లాడానని.. ఇప్పుడు కూడా నా మనసులో ఉన్న మాటను చెప్పానని.. గతంలో చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. అయితే చరణ్‌ను పొట్టివాడుగా అనడంతో మెగా ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో అంటూ ఫిలింనగర్‌లో చర్చించుకుంటున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



